Planting Trees: జ్యోతిషం పురాతనమైన శాస్త్రం. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఆరోజు ఆ ఘడియలలో ఉన్న నక్షత్రం జన్మనక్షత్రం అవుతుంది. దానికి మీకు కచ్చితంగా సంబంధం ఉంటుంది అనేది మన పూర్వీకుల అభిప్రాయం. నమ్మకం. ఇక మీరు ఆ నక్షాత్రనికి సంబంధించిన చెట్టు లేదా మొక్కను నాటితే, పెంచితే అది పెరిగి పెద్దయ్యేకొద్దీ శుభాలను ఇస్తుంది.
నక్షత్రాలు – నాటాల్సిన చెట్టు
అశ్వని – – జీడిమామిడి
భరణి – – దేవదారు
కృత్తిక – – అత్తి (మేడి)
రోహిణి – – నేరేడు
మృగశిర – – మారేడు
ఆరుద్ర – – చింత
పునర్వసు – – గన్నేరు
పుష్యమి – – పిప్పలి
ఆశ్లేష – – బొప్పాయి
మఖ – – మర్రి
పుబ్బ – – మోదుగ
ఉత్తర – – జువ్వి
హస్త – – కుంకుడు
చిత్త – – తాడి
స్వాతి – – మద్ది
విశాఖ – – మొగలి
అనూరాధ – – పొగడ
జ్యేష్ఠ – – కొబ్బరి
మూల – – వేగి
పూర్వాషాఢ – – నిమ్మ
ఉత్తరాషాఢ – – పనస
శ్రవణం – – జిల్లేడు (తెల్లజిల్లేడు మరీ శ్రేష్ఠం)
ధనిష్ఠ – – జమ్మి
శతభిషం – – అరటి
పూర్వాభద్ర – – మామిడి
ఉత్తరాభాద్ర – – వేప
రేవతి – – విప్ప
ఇక మీ నక్షత్రం చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆవృక్షాన్ని దర్శించి నమస్కరించాలి. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆవృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకండి. మీ పిల్లలచేత కూడా వారికి సంబంధించిన వృక్షాన్ని నాటించండి. తప్పక జీవితంలో శుభాలు కలుగుతాయి.
వృక్షో రక్షిత రక్షితః