Singotam Lakshmi Narasimha Swamy : నరసింహస్వామి… తెలుగురాష్ట్రాలు నారసింహ క్షేత్రాలకు ప్రసిద్ధి చెందినవి. యాదాద్రి, ధర్మపురి, సింహాద్రి, ఆహోబిలం, మంగళగిరితోపాటు నవనారసింహ క్షేత్రాలు, ఇతర లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. ఒక్కో క్షేత్రం ప్రత్యేకత ఒక్కో విధంగా ఉన్నాయి. నారసింహ అవతారం ఎత్తిన తర్వాత వెలిసిన ఈ క్షేత్రాలు చాలా శక్తివంతమైనవి. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లులుగా ఇవి పేరుగాంచాయి. అయితే నారసింహ స్వామి లింగరూపంలో వెలసిన ఆలయం తెలుగు రాష్ట్రంలో ఉండటం మన అదృష్టం. ఆ ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి తెలుసుకుందాం…

Singotam Lakshmi Narasimha Swamy : సింగోటం లక్ష్మీనరసింహస్వామి

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం ఉంది.

యాదగిరిగుట్ట తరువాత తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నరసింహ స్వామి ఆలయం ఇది. స్వామివారు ఇక్కడ లింగాకారంలో దర్శనమిస్తారు. ఈ దేవాలయాన్ని సుమారు 900 ఏండ్ల కిందట నిర్మించినట్లు తెలుస్తుంది.

స్థల పురాణం

పూర్వం సింగోటం గ్రామంలోని ఒక పేద రైతు పొలం గట్టు దగ్గర దున్నుతుండగా నాగలికి శిల అడ్డుతగిలింది. దాని తొలగించి గట్టుపై పెట్టాడు ఆ రైతు. అయితే ఆ శిల ప్రతిరోజు పొలం గట్టు నుండి మాయమై మళ్ళీ నాగలికి అడ్డు తగులుతుండగా రైతు భయపడిపోయాడు. అనంతరం శిలారూపంలో వున్న శ్రీ నృసింహస్వామి సింగమనాయుడికి కలలో కనిపించి ప్రతిరోజు రైతుకు కనిపిస్తున్నా ఆయన గుర్తించలేదని అందువల్ల నీవు వెళ్ళి సూర్యోదయానికి ముందే లింగాకారాన్ని తొలగించి పవిత్ర స్థలంలో ప్రతిష్టించమని ఆదేశించాడు. నిద్ర మేల్కొని వెంటనే ఆ లింగాన్ని ప్రతిష్టించాడు. లింగాకారంలో వున్నా స్వామికి ప్రతి సోమవారం, శనివారాలలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంక్రాంతి పర్వదినం అనంతరం స్వామివారికి నెలరోజులపాటు ఇక్కడ తిరునాళ్లు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ వేళలు- ఉదయం 6.00 నుండి రాత్రి 7.00 వరకు. ఇక్కడి దేవాలయంలో నిర్వహించే ముఖ్యపండుగలు..

నరసింహ జయంతి, కార్తీక మాసం, మహాశివరాత్రి, నరసింహ ద్వాదశితోపాటు ఇతర పండగ రోజుల్లో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు.

రవాణా మార్గాలు: ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యం ఉంది.

ఈ క్షేత్రం కొల్లాపూర్ నుండి 21 కి.మీ దూరంలో, వనపర్తి నుండి 31 కి.మీ, హైదరాబాద్ నుండి 140 కి.మీ దూరంలో ఉంది. అన్ని ప్రధాన పట్టణాల నుంచి వనపర్తి, కొల్లాపూర్‌కు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి సులభంగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

ఈ క్షేత్రాన్ని సందర్శిండం వల్ల లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా సంతానం పొందాలనుకునేవారికి, వివాహం, ఈతి బాధలు, ఐశ్వర్యం కావాలనుకునే వారికి ఈ క్షేత్ర సందర్శన వల్ల వారి కోరికలు తీరుతాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 18, 2021 at 9:02 ఉద.