Silhouette of young woman in lotus position sitting on the beach and medditating

Sun Worship : సూర్యుడు.. మనకు కనిపించే ప్రతక్ష్య దైవంగా అభివర్ణిస్తారు. సకల జీవరాశులకు ఆధారభూతమైనవాడు సూర్యుడు. ఆయన రాకతోనే జీవనం ప్రారంభం అవుతుంది. అయితే సూర్యుడి గురించి నేటి కంటే మన పూర్వీకులు ఎక్కువగా అధ్యయనం చేశారని చెప్పవచ్చు. వారు సూర్యుడిలోని అనేక విశేషాలను వేదాలలో,పురాణాలలో వివరించారు. ప్రస్తుత కరొనా కాలంలో అందరికీ కావాల్సింది ఆరోగ్యం. రోగనిరోధక శక్తి. అటువంటివి ఇవ్వగలిగిన వాడు సూర్యుడు. పూర్వీకులు చెప్పినవి ఒక్కొక్కటి నేటి శాస్త్రవేత్తలు అంగీకరించడం మనం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం సూర్యారాధన ఏయే మాసాలలో ఏ పేర్లతో చేయాలో తెలుసుకుందాం… అనేక పురాణాల్లో సూర్యోపాసన విధానం గురించిన వివరాలెన్నో ఉన్నాయి. భవిష్య పురాణంలో మాంధాత రాజు సూర్య వ్రతాన్ని గురించి తమ కులగురువు వశిష్టులవారిని అడిగినప్పుడు ఆ మహర్షి చెప్పిన విశేషాలు.. ఆయా మాసాలలో… సూర్యుడికి అత్యంత ప్రధానమైన మాసం మాఘమాసం.. ఆయన పుట్టిన రోజు వచ్చే రథసప్తమి ఈ నెలలోనే ఉంది.

మాఘమాస సూర్య (ఆది)వారంనాడు ‘వరుణాయ నమః‘ అనీ, ఫాల్గుణమాసంలో ‘సూర్యాయ నమః‘ అనీ, చైత్ర మాసంలో ‘భానవే నమః‘ అని, వైశాఖమాసంలో ‘తపనాయ నమః‘ అని, జ్యేష్టమాసంలో ‘ఇంద్రాయ నమః‘ అని, ఆషాఢమాసంలో ‘రవయే నమః‘ అని, శ్రావణమాసంలో ‘గభస్తయే నమః‘ అని, భాద్రపదమాసంలో ‘యమాయ నమః‘ అని, అశ్వయుజమాసంలో ‘హిరణ్య రేతసే నమః‘ అని, కార్తీక మాసంలో ‘దివాకరాయ నమః‘ అని, మార్గశిర మాసంలో ‘మిత్రాయ నమః‘ అని, పౌష్యమాసంలో ‘విష్ణవే నమః‘ అనీ వివిధ మాసాలలో, వివిధ నామాలూ, వివిధ నైవేద్యాలతో సూర్య వ్రతం చేసిన తరువాత, ఉద్యాపన కూడా చేయాలి.

ఇంతేకాదు ఆదిత్యుడికి సంబంధించిన యెన్నెన్నో ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు పేర్కొన్నాయి.

అదేవిధంగా భారతదేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమైనవి ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. గుజరాత్ మోదెరాలో సూర్య దేవాలయం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయం, పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం ప్రముఖమయినవి. అదేవిధంగా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది. ఇలా అనేక సూర్యదేవాలయాలు భారతదేశంలో ఉన్నాయి. సూర్యారాధన ఎక్కువగా చేయడం వల్ల గుజరాత్‌ ప్రాంతాన్ని సౌరాష్ట్రగా అభివర్ణిస్తారు. అక్కడ సూర్యా ఉపాసకులు ఎక్కువగా ఉన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 15, 2021 at 11:40 ఉద.