Thilatharpanapuri Temple : గణపతి.. విఘ్ననాయకుడు. వినాయకుడు పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది గజముఖం. ఆయన పెద్ద చెవులు, తొండం. కానీ తొండం లేని వినాయకుడు దేవాలయం ఒకటి ఉందంటే ఆశ్చర్యం కలుగకమానదు. కానీ అలాంటి దేవాలయం ఉంది. ఆ విశేషాలు తెలుసుకుందాం…

బాలగణపతి
ఈ ఆలయం పేరు తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారాలయం. ఇక్కడ గణపతి తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో వుంటారు. ఇలాంటి ఆలయం చాలా అరుదుగా వుంటుంది. అంతేకాక ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే గణపతి. ఇక్కడ నరముఖంతో వున్న గణపతి వున్నారు. ఈ ఆలయం ముఖ్యంగా నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతితో చాలా ప్రసిద్ధి చెందినది.

పితృదోష నివారణాలయం
ఈ ఆలయంలో మరో విశేషం ఉంది. అది… ఎవరైతే పిత్రుదోషాలతో బాధపడుతున్నారో వారు దర్శించి పితృదోషాలను పోగొట్టుకోవలసిన ఆలయంగా ఇది ప్రసిద్ధిగాంచింనది. ఈ ఆలయంలో సాక్షాత్తూ రాములవారు తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవటంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టమని చెప్పిన స్థలం.

Thilatharpanapuri Temple : నరముఖ గణపతి Naramukha Ganapati

అందుకనే ఈ ఊరిని “తిలతర్పణపురి” అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం. అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది.తిలతర్పణపురిలో రాములవారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో మారటం జరిగింది. అందువలన ఈ ఊరిని తిలతర్పణపురి అని పిలుస్తున్నారు. ఈ ఆలయం ముఖ్యంగా దేశంలోనే ప్రముఖ మోక్ష స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా చెప్పబడుతోంది.

Thilatharpanapuri Temple : నరముఖ గణపతి Naramukha Ganapati 

రవాణా సౌకర్యం
ఈ ఆలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలో, తమిళనాడులోని తిరునల్లార్శని భగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలో ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 18, 2021 at 4:30 సా.