Tirumala RS 300 Special Darshan Tickets For January 2024 : తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. మన దేశంలో ఉన్న ఆలయాల్లో తిరుమలలో చాలా రద్దీ ఉంటుంది. తిరుమల దర్శనం కావాలంటే కనీసం ఒక్క రోజు అయినా పడుతుంది. వెంటనే దర్శనం కావాలంటే చాలా కష్టం. కనీసం 10 గంటల సమయం అయినా పడుతుంది. ఒకవేళ ప్రత్యేక దర్శనం కావాలంటే మాత్రం కొంచెం డబ్బులు కట్టాలి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 పెట్టి టికెట్ తీసుకోవచ్చు. రూ.300 పెట్టడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ.. ఆ టికెట్లు కూడా దొరకవు. వెంటనే దొరకవు. రెండు, మూడు నెలల ముందే రూ.300 టికెట్లు కూడా తీసుకోవాలి. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దసరా, దీపావళి పండుగల సీజన్ కావడం, స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు.
మరోవైపు ఈ నెల 15 నుంచి 23 వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ సమయంలో భక్తులు పోటెత్తుతారు. భారీగా భక్తులు వస్తారు. అందుకే టీటీడీ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. కనీసం రోజుకు లక్ష మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే.. 2024 కొత్త సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అనుకునే వాళ్ల కోసం ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసే తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం ప్రత్యేక దర్శనం టికెట్లు పూర్తయ్యాయి. ఇక వచ్చే సంవత్సరం ప్రత్యేక దర్శనం టికెట్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. అందులో జనవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీ ఖరారు అయింది.
Tirumala RS 300 Special Darshan Tickets For January 2024 : అక్టోబర్ 24న ఉదయం 11కి రూ.300 టికెట్ల విక్రయాలు ప్రారంభం
అక్టోబర్ 24న ఉదయం 11 కు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. ttdevasthanams.ap.gov.in అనే వెబ్ సైట్ లో రూ.300 టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇవి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. 24న ఉదయం 11 గంటలకు ఆ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. జనవరి నెలలో ఏ తేదీన మీరు తిరుమలను దర్శించుకోవాలని అనుకుంటున్నారో ఆ తేదీన రూ.300 పెట్టి ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అలాగే.. అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు తిరుపతి, తిరుమలలో రూమ్స్ బుకింగ్ కూడా అదే వెబ్ సైట్ లో స్టార్ట్ అవుతుంది.
అంగ ప్రదక్షణం టికెట్లు అక్టోబర్ 23న ఉదయం 10కి విడుదల అవుతాయి. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అక్టోబర్ 23న ఉదయం 11 గంటలకు విడుదల అవుతాయి. అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే.. అర్జిత సేవ లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ కోటా టికెట్లు ఈనెల 18న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అర్జిత సేవా టికెట్లు అక్టోబర్ 21న ఉదయం 10కి రిలీజ్ అవుతాయి. వర్చువల్ సేవా టికెట్లను 20న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.