Tulsikota Position for the betterment of your children’s future! మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే తులసీకోటను ఇక్కడ పెట్టండి !

తులసీ.. ప్రతి హిందువు ఇంట్లో ఉండే పవిత్రమైన మొక్క. అయితే ఈ తులసి కోటను ఇంట్లో ఏ దిక్కులో పెట్టుకోవాలి.

ఏ వైపున పెట్టుకుంటే ఏం ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం…
తులసీ పరమ పవిత్రమైన మొక్క. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తులసీదేవిని ఆరాధిస్తే విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించిన ఫలితం వస్తుంది. అయితే ఈ తులసీ కోటను ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం… తులసి కోట ఇంటికి తూర్పున లేదా పడమర, ఉత్తరం లేదా దక్షిణం నాలుగు దిక్కుల ఏ వైపు నైనా పెట్టుకోవచ్చు, తూర్పుకు తులసి కోట పెట్టుకోవడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది.

ఆడవారు దీర్ఘకాల ముత్తైదువులు ఉంటారు. తులసి కోట పడమటి వైపు ఉండడం వల్ల ధనలాభం కలుగుతుంది. తులసి కోట దక్షిణం వైపు ఉండడం వల్ల మోక్షం కలుగుతుంది. తులసి కోట ఉత్తరం వైపు ఉండడం వల్ల జ్ఞానం కలుగుతుంది. మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మంచి బుద్ధి వస్తుంది. ఇంట్లో పిల్లలకి విద్యాబుద్ధులు పెరుగుతాయి. అల్లరి చేయకుండా ఉంటారు. ఉత్తరం వైపు తులసి కోట ఉంచి పూజ చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నారద పురాణంలో బ్రాహ్మణ వేదోక్త పురాణంలో తులసి మహత్యం లోను దేవి భాగవతంలో కూడా చెప్పబడినది.

తులసి దగ్గర తులసి చుట్టూ స్త్రీలు బహిష్ఠు సమయంలో మూడు రోజులు తులసిని చూడరాదు. అటు వైపు వెళ్ళాడం, తగలడం కూడా పనికిరాదు. మైల వచ్చినవారు ఇంటి పేరు ఉన్నవాళ్లు చనిపోయినప్పుడు ఇంకెవరైనా పోయినప్పుడు కూడా తులసి దగ్గరకి వెల్ల కూడదు. ఆ సమయంలో మంచి వాళ్ల చే తులసి పూజ చేయించడం, ఆ తులసికోటలో నీళ్లు పోయడం చేయించడం మంచిది. తులసి కోటలో పోసే నీరు కూడా శుభ్రమైన నీరు తాజా నీరు పోయాలి. ఎంగిలి నోటితో తులసీమాతని ముట్టుకోకూడదు. మల మూత్ర విసర్జన చేసిన దుస్తులతో తులసి కోటను ముట్టుకో కూడదు. తల దువ్వుకునే ఆడవాళ్ళు తులసి కోట దగ్గర నిలబడి తల దువ్వు కోకూడదు.

దీనివల్ల తల నుంచి రాలిన వెంట్రుకలు ఎన్ని తులసికోటలో పడతాయో అంత కాలం పాటు అనారోగ్యాలతో బాధపడి చనిపోతారు ఇది శాస్త్ర ప్రమాణం. పోతన గారు అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షంలో గజేంద్రని చేత రాయించిన పద్యం లో చక్కగా తులసీ వివరాలు పేర్కొన్నారు. తులసిని పవిత్రంగా చూడడం మంచిది.

ఇక నేటి సైన్స్ ప్రకారం చూస్తే తులసీలో ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగనవే. తులసీ ఆకులను రోజు ఒక్కటి చొప్పున తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా తులసీ కాండంతో కొన్ని ఔషధాలు చేస్తారు. తులసీ కషాయం, తులసీ, తేనేతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. పురాణ పరంగా, ఔషధం అంటే వైద్యపరంగా పవిత్రమైన మొక్క తులసీ. తప్పక ప్రతి ఒక్క ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్క.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 7, 2021 at 7:05 సా.