Ugadi Telugu New Year : ఉగాది.. తెలుగు కొత్త సంవత్సరం. యుగాది ఆరంభమైన రోజే ఉగాదిగా జరుపుకొంటారు. ఉగాది అంటే ప్రతి ఏటా చైత్ర మాస శుద్ధ పాడ్యమిన వస్తుంది. ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజునే బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. అదేవిధంగా పురాణాల ప్రకారం విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. పూర్వం గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే జరిగింది. ఉగాది పండగకు సంబంధించి ఇలాంటి అనేక విషయాలు మన పురాణాల్లో ఉన్నాయి.

ప్రకృతిలో కొత్తదనం ప్రారంభం అయ్యే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడి పడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖీ, బెంగాలీలు పాయ్లా బైశాఖ్ అనే పేర్లతో ఉగాదిని జరుపుకుంటారు.
ఏం చేయాలి ?

Ugadi Telugu New Year పంచాగశ్రవణం

ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. తలకు నువ్వుల నూనె పట్టించాలి. నలుగు పిండితో అభ్యంగన స్నానం చేయాలి. కొత్త దుస్తులు ధరించాలి. మొదట గణపతికి తర్వాత లక్ష్మీ , తర్వాత ఇష్టమైన దేవుడికి పూజ చేయాలి. ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా తినాలి. తర్వాత పంచాంగ శ్రవణం వింటే మంచిది. రాశులు, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాకుండా వాతావరణ విశేషాలు, గ్రహణాలు, పండుగలు, పుష్కరాలు, మూఢాలు తదితర విశేషాలను ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు.
ఇలా ఉగాదినాడు పూజలు, పంచాగశ్రవణం చేయడం వల్ల ఏడాది అంతా శుభఫలితాలు వస్తాయి.

– ఉగాది పచ్చడి, దేవుడు ఫోటులు వాడగలరు

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Raju Kumar

Raju Kumar is the man behind all the Devotional content, having 10+ years of experience in media and news coverage, Raju brings in all the quality content.

Mail

Published on ఏప్రిల్ 12, 2021 at 5:05 ఉద.