What is Salagram? (సాలగ్రామం) హిందూ ధర్మంలో విగ్రహారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. భక్తులు భగవంతున్ని అనేక రూపాలలో పూజిస్తారు. అయితే ఎక్కువ మనం వినే రూపాలలో సాలగ్రామార్చన. అసలు సాలగ్రామం అంటే ఏమిటి? దీని విశేషాలు తెలుసుకుందాం…

సాలగ్రామం అనేది ఒక రకమైన శిల అంటే రాయి. ఇది ఒక ఓ జలచరం (పురుగువల్ల)వల్ల తయారౌతుంది. సాలాగ్రామాలు చాలా అరుదైనవి. ఇవి నర్మదానదిలో ఎక్కువగా దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో కూడా దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ”ముక్తినాథం” పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.

సాలగ్రామ విశేషాలు
సంస్కృతంలో ”శిలగా మారిన శలభమే సాలగ్రామం” అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.

What is Salagram? (సాలగ్రామం) and its Importance
What is Salagram? (సాలగ్రామం) and its Importance

ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.
సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.

అర్చన విధి ఎలా ?
సాలగ్రామం అత్యంత శక్తివంతమైన శిలారూపంగా హిందూమతం పేర్కొంటుంది. సాలగ్రామం తెచ్చుకొని దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. శుచి, శుభ్రత, వంటి నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం అత్యంత పవిత్రమైనది. సలక శుభాలు కలుగుతాయి.

ఎవరు పెట్టుకోవాలి ?
నిత్య దేవతారాధన చేసేవారు, శుచి, శుభ్రత, అంటు,ముట్టు వంటి నియమ నిబంధనలను పాటించే వారు సాలగ్రామార్చన చేసుకోవచ్చు. అదేవిధంగా నిత్యనైవేద్యం పెట్టడం, పూజ చేయడం తప్పనిసరి. ఇలాంటి కొన్ని శాస్త్రం చెప్పిన నియమ నిబంధనలను పాటించే వారు సాలగ్రామార్చనలు చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి దగ్గరలోని పండితులను సంప్రదించిం తెలుసుకోండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 26, 2021 at 7:53 ఉద.