Viral News: అంటే అన్నారు అంటారు కానీ.. పండు ముసలోడికి 28 ఏళ్ళ యువతీతో పెళ్లి ఏంటబ్బా!

Akashavani

Viral News: భారత క్రికెట్ జట్టుకు చెందిన ఒక మాజీ క్రికెటర్ తన 66 వ సంవత్సరంలో తన చిరకాల స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నారు. అదేంటి 66 సంవత్సరాల వయసున్న వ్యక్తికి 28 సంవత్సరాల స్నేహితురాలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి ఇది నిజం.. భారత్ క్రికెట్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ తన 66వ సంవత్సరంలో 28 సంవత్సరాల తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి వివాహం మే రెండవ తేదీ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుపుకుంటున్నారు.

ఇలా వీరి వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది వీరి పెళ్లి గురించి తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ లాల్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన ఇదివరకే రీనా అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నారు. ఈ విధంగా తన భార్య రీనాతో మనస్పర్ధలు రావడం చేత పరస్పరం వీరిద్దరూ అంగీకారంతోనే విడిపోయారు. అయితే ప్రస్తుతం రీనా అనారోగ్యం పాలవడంతో అరుణ్ లాల్ తనతో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరుణ్ తన స్నేహితురాలు బుల్ బుల్ (28) అనే యువతిని మే 2వ తేదీ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

Viral News: వయసు ఒక సంఖ్య మాత్రమే…

ఇక ఇదే విషయాన్ని తన భార్య రీనా దగ్గర చెప్పడంతో అందుకు ఆమె సంతోషించి వీరి వివాహానికి ఒప్పుకున్నారు.ఇక మీ రెండవ తేదీ వీరి వివాహం కావడంతో ఈ జంట ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయం తెలిసిన ఎంతోమంది నెటిజన్లు ఇలా పండు ముసలోడికి యువతితో పెళ్లి ఏంటి అంటూ ఆశ్చర్యపోగా వీరు మాత్రంపెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని, వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలని ఈ జంట నిరూపించారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -