Aamani – Hruthika: నట వారసురాలిని దింపేసింది..ఆమెలా అయితే కష్టమనే కామెంట్స్..

G K

Aamani – Hruthika: సీనియర్ హీరోయిన్స్ కొంతమంది ఇప్పుడు తమ నట వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అయితే, ఇప్పటి
జనరేషన్‌తో పాటు జనాల మైండ్ సెట్స్..సినిమా మేకింగ్ విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మడికట్టుకుని పాత్రలు చేస్తున్న హీరోయిన్స్‌కు అంతగా ఇండస్ట్రీలో స్పేస్ ఉండటం లేదు. ఎంత సేపూ స్క్రీన్ మీద అందాల ఆరబోతతో ప్రేక్షకులను రెచ్చగొడుతూ హీరోలతో రొమాన్స్ చేస్తున్న వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి.

ఇక్కడ అవకాశం అందుకోవాలంటే కావాల్సింది టాలెంట్‌తో పాటు గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలి. లేదంటే బిచానా సర్దేయాల్సిందే. ఇప్పుడు ఇండస్ట్రీలోకి సీనియర్ నటీమణి ఆమని నటవారసురాలు ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఆమె కూతురు మాత్రం కాదు. మేనకోడలు. ఆ అమ్మాయి పేరు హృతిగా. తాజాగా తెరకెక్కుతున్న ఓ ప్రేమ కథా చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అయితే, అప్పట్లో ఆమని కంప్లీట్ ఫ్యామిలీ చిత్రాల కథానాయిక అని మాత్రమే చెప్పుకునే పాత్రలు చేసింది.

Aamani – Hruthika: అలాంటి డీసెంట్ పాత్రలు చేస్తూ నెట్టుకు రావడం చాలా కష్ఠం..

ఆమని గ్లామర్ రోల్స్ చేసింది చాలా తక్కువ. నాగార్జున నటించిన ఘరాణ బుల్లోడు లాంటి సినిమాలలో ఒకటి రెండు పాటల్లో మాత్రమే కాస్త గ్లామర్‌గా కనిపించింది. అయితే, ఇప్పుడు ఆమె మేనకోడలు హృతిగా మాత్రం అలాంటి డీసెంట్ పాత్రలు చేస్తూ నెట్టుకు రావడం చాలా కష్ఠం. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతోందో. కాగా, హృతిగా అభిలాష్‌ భండారి హీరోగా రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటొస్తోంది. ఈ మూవీకి జీవీకే దర్శకత్వం వహిస్తున్నాడు.

- Advertisement -