Aamir Khan daughter: సినీ లవర్స్ కి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక అమీర్ ఖాన్ తెలుగు ప్రేక్షకులతో కూడా మంచి ర్యాపో పెంచుకున్నాడు.
ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ కూతురు అయినటువంటి ఐరా ఖాన్ ప్రస్తుతం ఒక వింత వ్యాధితో బాధపడుతుంది. ఆ రోగం ఆమెను పట్టిపీడిస్తుందని ఐరా ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఐరా ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సమస్యను నెటిజన్ల కు పంచుకుంది.
అసలు ఆమె ను వెంటాడుతున్న ఆ రోగం పేరు క్రయింగ్ పిట్స్ అని చెప్పుకొచ్చింది. ఆరోగ్యం గురించి చెప్పుకుంటూ ఆమె చాలా బాధపడింది. అంతేకాకుండా గతంలో ఎప్పుడు ఇలాంటి వ్యాధితో బాధపడటం లేదని చెప్పుకొచ్చింది. దీనివల్ల హార్ట్ బీట్ సరిగ్గా జరగకపోవడం, ఊపిరి ఆడక పోవడం లాంటివి జరుగుతాయని చెప్పుకొచ్చింది.
ఇక ఈ సమస్య నాకే ఎందుకు వచ్చిందో అంటూ.. బాధపడుతుంది ఐరా ఖాన్. ఇక రెండు నెలలకోసారి ఈ వ్యాధికి గురయ్యే నేను ప్రస్తుతం రోజు ఈ వ్యాధితో బాధ పడుతున్నాను అన్నట్లు తెలిపింది. ఇక ఇలాగే కంటిన్యూ అయితే మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిందే అని చెప్పుకొచ్చింది.

Aamir Khan daughter: ఐరా ఖాన్ చివరిలో ఇలా బాధపడింది!
ఇక తనకి నిద్ర అసలు ఏమాత్రం పట్టడం లేదని ఈ యాంగ్జైటీ ఎటాక్ అసలు నన్ను వదలడం లేదని ఆమె బాధ పడుతుంది. అంతేకాకుండా నా భయాలు ఏమిటో కనుక్కోవడానికి ట్రై చేసినా ఎలాంటి ఉపయోగాలు లేవని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐరా ఖాన్ పంచుకున్న నోట్ వైరల్ గా మారింది. వీలుంటే మీరు కూడా దానిపై ఒక లుక్కేయండి.