Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఎనిమిదవ వారం బయటకు వచ్చినటువంటి కంటెస్టెంట్ సందీప్ మాస్టర్ ప్రస్తుతం ఈ కార్యక్రమం గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం 9 వ వారంలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరిని కూడా బిగ్ బాస్ 2 భాగాలుగా విడదీశారు. ఇలా టీమ్స్ ను విభజించిన తరువాత జంపింగ్ జపాంగ్ టాస్క్ లో యావర్ టీమ్ గెలిచింది. దీంతో బిగ్ బాస్ ఆ టీమ్ కి ఒక అవకాశం ఇచ్చి ఎదురు టీమ్ నుండి ఒకరిని డెడ్ చేయవచ్చనేలా రూల్ పెట్టాడు. అలా డెడ్ చేసిన సభ్యులు టాస్క్స్ ఆడటానికి లేదన్న మాట.
ఈ క్రమంలో గౌతమ్ ప్రత్యర్థి టీమ్ నుండి ప్రశాంత్ ని డెడ్ చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఈ కెప్టెన్సీ టాస్క్ ముగిసే వరకు డెడ్ బోర్డు మెడలో వేసుకుని తిరగాలి అంతే కాకుండా ఆయనకు కెప్టెన్ అయ్యే అవకాశం కూడా లేకుండా పోయింది ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ కు డెడ్ ఇవ్వడంతో ఈ విషయంపై సందీప్ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. పల్లవి ప్రశాంత్ ఒక మంచి ప్లేయర్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలాంటి వారిని టాస్క్ లో ఆడకుండా ఇలా డెడ్ బోర్డు వేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు.
స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను బయటకు పంపుతున్నారు..
ఒక సాంగ్ కంటెస్టెంట్ టాస్క్ లో ఉంటే మీరు గేమ్ ఆడలేరా? భయమా? స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఆడండి, స్ట్రాంగ్ ప్లేయర్స్ ని బయటకు పంపి ఆడితే కిక్కు ఉండదు, అఫ్ కోర్స్ నన్ను కూడా అందుకే బయటకు పంపారు. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటూ కామెంట్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ విధంగా సందీప్ మాస్టర్ అనుకోని విధంగా ఎనిమిదవ వారం ఎలిమినేట్ కావడంతో ఆ ఎలిమినేషన్ పట్ల ఆయన కూడా ఎంతో ఫీలవుతున్నారని ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన ఎలిమినేషన్ గురించి ఆవేదన బయట పెట్టారు. మరి ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఎవరు విజయం సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది.