Abhay Ram: సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారసత్వాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాజాగా మరొక స్టార్ హీరో కూడా తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమా ద్వారా అభయ్ రామ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు కూతురు సితార కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందబోయే సినిమాలో కూడా సితార నటించనున్నట్లు తెలుస్తోంది.
Abhay Ram: అక్క తమ్ముళ్లుగా సితార అభయ్ రామ్..
ఇక ఈ సినిమాలో సితారతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తనయుడు కూడా నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 15 నిమిషాల పాటు ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సితార – అభయ్ రామ్ ను అక్కాతమ్ముళ్లుగా చూపించేందుకు జక్కన్న ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీంతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.