Abhinaya మహేష్ బాబు చెల్లి కి డాక్టరేట్… శభాష్ అంటున్న నెటిజన్లు….

Joythi R

Abhinaya ప్రతిభ ఉన్నవారికి అంగవైకల్యం ఏమాత్రం అడ్డుకాదని ఇప్పటికే చాలామంది నిరూపించారు. అయితే ఈ టైటిల్ చూడగానే ముందుగా మీకు ఒక డౌట్ రావొచ్చు. ఇందులో ముఖ్యంగా మహేష్ బాబు చెల్లి కి డాక్టరేట్ రావడం ఏమిటని అసలు మహేష్ బాబు చెల్లి చదువుకుంటుందా అని. అక్కడికే వస్తున్నా… మహేష్ బాబు చెల్లి అంటే సొంత చెల్లెలు కాదు. తెలుగు ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ బాబు చెల్లెలి పాత్రలో నటించిన మలయాళం బ్యూటిఫుల్ నటి అభినయ. అయితే నటి అభినయ వాస్తవానికి మూగ మరియు చెవుడు. కానీ ఈమెకు నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో మరియు అందం అభినయం కూడా ఉండటంతో సినిమా ఇండస్ట్రీ ఎంతగానో ఆదరించింది. కాగా ఈ మధ్య కాలంలో నటి అభినయ వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.

అయితే నటి అభినయ సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ చదువుకోవాలని ఎంతో కోరికగా ఉండేది. కానీ అది సాధ్యపడకపోవడంతో కొంతమేర నిరాశ పడేది. అయితే ఈ మధ్యకాలంలో నటి అభినయ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇందులో భాగంగా తాజాగా నటి అభినయ సెయింట్ మదర్ తెరిసా యూనివర్సిటీ నుంచి తనకు డాక్టరేట్ లభించిందని తెలిపింది. మరియు డాక్టరేట్ అందుకుంటున్న సమయంలో దిగినటువంటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే మదర్ తెరిసా యూనివర్సిటీ నుంచి గౌరవప్రదమైన డాక్టరేట్ లభించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తనని ఎంతగానో ఆదరించిన అభిమానులకి మరియు తన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపింది. దీంతో నాటి అభినయ ఫ్యాన్స్ ఈ అమ్మడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే కృషి పట్టుదల ప్రతిభ ఉన్నవారికి వైకల్యం ఎప్పుడూ అడ్డు కాదని నిన్నటి అభినయ మరోమారు నిరూపించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నటి అభినయ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పెద్దగా దృష్టి సారించడం లేదు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి మలయాళం మరియు తమిళ భాషలలో సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అందువల్లనే టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమ పై పెద్దగా దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. అయితే నటి అభినయ కేవలం సెంటిమెంట్ ఓరియెంటెడ్ పాత్రలలో మాత్రమే కాకుండా ఆ మధ్య తెలుగులో ప్రముఖ నటీనటులు హీరో నాగార్జున మరియు సమంత కలిసి నటించిన రాజు గారి గది 2 చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం నటి అభినయ కన్నడలో ఆటో రమణ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

- Advertisement -