Actor Danush: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు ధనుష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన డ్రీమ్ హౌస్ లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.గత రెండు సంవత్సరాల క్రితం ఈయన అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇంటిని నిర్మించుకోవడం కోసం చెన్నైలోని పోయిస్ గార్డెన్ లోఏకంగా 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేశారు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఈయన ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి భూమి పూజ కూడా చేశారు.
ఇలా అన్ని సౌకర్యాలతో ఈ ఇంటిని నిర్మించి ఇందులోనే తన భార్య పిల్లలతో నివసించాలని ధనుష్ భావించారు. అయితే ఈ ఇంటి నిర్మాణం చేపడుతున్న సమయంలోనే ధనుష్ కొన్ని కారణాలవల్ల ఐశ్వర్యతో విడాకులు తీసుకొని విడిపోయారు.ఇలా ఈయన తన భార్యకు విడాకులు ఇచ్చిన ఇంటి నిర్మాణం ఆపకుండా తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన కొత్తింట్లోకి తన కుటుంబ సభ్యులతో కలిసి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఈ ఇంటిలో ధనుష్ అన్ని సౌకర్యాలతో ఎంతో అందంగా సుందరంగా తీర్చిదిద్దారని తెలుస్తోంది.
Actor Danush: ఇంటి కోసం 150 కోట్లు ఖర్చు చేసిన ధనుష్….
ఇలా ఈయన తన డ్రీమ్ హౌస్ నిర్మించడం కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఏది ఏమైనా తన భార్య పిల్లలతో కలిసి ఉండాలనుకున్నటువంటి ఈయనకు మాత్రం ఆ ఒక్కటి తీరని కోరికగా మిగిలిపోయింది.అయితే ఐశ్వర్యకు విడాకులు ఇవ్వడంతో ధనుష్ సైతం ఈ ఇంటిలో తాను నివసించకుండా ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చినట్టు తన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే ఈయన సార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.