Actor Nani: నాచురల్ స్టార్ నాని ఎన్నో విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకొని తన సహజ నటనతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈయన కెరియర్లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా సమానంగా వస్తున్నాయి.ఇకపోతే తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికి. ఈ సినిమాలో హీరో నానితో పాటు మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో సందడి చేశారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 10వ తేదీ విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త స్లోగా ముందుకు నడుస్తోందని చెప్పాలి. ఇప్పటికే సినిమా విడుదల అయి దాదాపు ఐదు రోజులు పూర్తి అయినప్పటికీ సినిమా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. దీంతో చిత్ర బృందం సినిమా కలెక్షన్ల విషయంలో కాస్త నిరాశకు గురయ్యారు. ఈ విధంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయ లేకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి ఆలోచన చేస్తే కరోనా రాకముందు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కటి థియేటర్లో విడుదలయ్యి ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేసేవి.

Actor Nani: సినిమా టికెట్ల రేట్లు పెరగడం కారణమా..
కరోనా సమయంలో ఓటీటీల ఆదరణను పెరిగిన తర్వాత చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలో విడుదల కావడంతో పెద్ద ఎత్తున చిన్న సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇకపోతే ప్రేక్షకులు థియేటర్ల ఎక్కువగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు చూడటానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలోనే సాధారణ సినిమాలలో స్టార్ సెలబ్రిటీలు నటించిన ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఇష్టపడటం లేదు. ఇకపోతే అంటే సుందరానికి సినిమా కన్నా ముందుగా విడుదలైన ఎఫ్ 3, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్టాయి. ఇలా ఈ సినిమాలు విజయవంతం అయ్యి,నాని సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడానికి సినిమా టికెట్ల రేట్లను పెంచడం కూడా కారణం కావచ్చని తెలుస్తోంది . ఏది ఏమైనా నాని సినిమా ఇలా బోల్తా కొట్టడం నిజంగానే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.