Actor Nani: నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.తరచూ విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి నాని ఈసారి సరికొత్త కథ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఈయన డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇలా ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకొని మార్చి 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులతో ముచ్చటించినటువంటి నానికి మీడియా ప్రతినిధి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది దసరా సినిమాలో కొన్ని సన్నివేశాలలో నటించడానికి మీరు మందు కొట్టారట ఇందులో ఇంతవరకు నిజం ఉంది అని ప్రశ్నించారు.
Actor Nani: కథ డిమాండ్ చేయడంతోనే…
ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ తాను దసరా సినిమాలో కొన్ని సన్నివేశాలలో నటించడం కోసం డైరెక్టర్ చెప్పిన విధంగానే మందు తాగానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని సన్నివేశాలలో కళ్ళు ఎర్రగా ఉండడం మందు తాగిన మేనరిజంతో నటించాల్సి వచ్చింది. అలా నటించడం కోసం డైరెక్టర్ శ్రీకాంత్ మందు తాగడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగినప్పుడు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తాను ఈ సన్నివేశాలలో మందు తాగి నటించానని తెలిపారు. ఇలా కథ డిమాండ్ చేయడంతోనే తాను మందు తాగానని ఈ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.