Actor Nani: అష్టా చమ్మా సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన నాని రోజు రోజుకి తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన దసరా సినిమాలో నాని నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నాని నటనకు సినీ విమర్శకుల నుండి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమా మీద ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శృతిహాసన్ ప్రియుడు శాంతను హజారిక నానికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.
శృతిహాసన్ గత రెండు సంవత్సరాలుగా శాంతనుతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ ముంబైలో కలిసి జీవిస్తున్నారు. శృతి హాసన్ ప్రియుడు శాంతను హజారిక డూడుల్ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల శాంతను హీరో నానికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల నాని హీరోగా విడుదలైన దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ ని డూడుల్ ఆర్ట్ లో రూపొందించి నానికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. దసరా సినిమా డూడుల్ ఆర్ట్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు.
Actor Nani నాని పై అభిమానాన్ని చాటుకున్న శంతను…
ఇలా డూడుల్ ఆర్ట్ తో శాంతను హీరో నాని మీద ఉన్న అభిమానం చాటుకున్నాడు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ శంతనుకి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన దసరా సినిమా విడుదలైన మొదటి రోజు నుండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 53 కోట్లు వసూలు చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో నాని పాన్ ఇండియా లెవెల్ లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.