Actor Nani: అష్టా చమ్మా సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నాని నటించిన సినిమాలు వరుసగా హిట్ అవటంతో ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని స్వయంకృషితో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని ” దసరా ” సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మార్చ్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఈ సినిమాలోని ఒక సన్నివేశం తనని చాలా ఇబ్బంది పెట్టిందని, ఆ సన్నివేశం వల్ల దాదాపు రెండు నెలల పాటు సరిగా నిద్ర పోలేదని నాని సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Actor Nani: నిద్ర కూడా సరిగా పట్టలేదు…
ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాల గురించి నాని మాట్లాడుతూ..” సినిమాలోని ఒక సన్నివేశంలో డంపర్ ట్రక్ బొగ్గుని తీసుకెళ్లి డంప్ చేస్తుంది. ఆ సమయంలో నేను ట్రక్ మీద నుండి కింద పడితే బొగ్గు నాపై పడాలి. దీనికోసం సింథటిక్ బొగ్గు తయారు చేశారు. అది మొత్తం డస్ట్ తో ఉంటుంది. సన్నివేశంలో సింథటిక్ బొగ్గు నుండి నన్ను పైకి లాగటానికి కొంతసమయం పడుతుంది. సింథటిక్ బొగ్గు లోపల ఉన్నంతసేపు నేను గాలి పీల్చాటానికి లేదు. ఎందుకంటె గాలి పీలిస్తే అందులో ఉన్న డస్ట్ మొత్తం ముక్కులోకి వెళ్తుంది. ఆ సీన్ షూటింగ్ పూర్తైన కూడా చాలా రోజుల వరకు ఆ ఘటన గుర్తుకు వస్తే చాలు ఏదోలా అవుతుంది. ఇలా దాదాపు రెండు నెలల పాటు ఆ సీన్ గుర్తు వచ్చినప్పుడు అలా కొంత సమయం గాలి పీల్చకుండా ఉండేవాడిని. అంతేకాకుండా దాదాపు రెండు నెలల పాటు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు అంటూ” నాని చెప్పుకొచ్చాడు.