Actor Naresh: నటుడు నరేష్ పవిత్ర లోకేష్ మే 26వ తేదీ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి నరేష్ పవిత్ర సినిమా కన్నా వారి వ్యక్తిగత విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి నరేష్ పవిత్రతో తనకున్నటువంటి రిలేషన్ గురించి అందరికీ క్లారిటీ ఇచ్చారు.
నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురు భార్యలకు దూరంగా ఉన్నారు. అయితే పవిత్రతో ప్రస్తుతం దగ్గర కావడంతో కేవలం పవిత్ర నరేష్ వద్ద ఉన్న డబ్బు చూసి మాత్రమే తన వద్దకు వెళ్ళిందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన నరేష్ తన వద్ద 1000 కోట్లకు పైగా ఆస్తి ఉందని తెలిపారు. ఇందులో కొంత నాకు వారసత్వంగా వచ్చిన ఆస్తికాగా మరికొంత నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అని తెలియజేశారు. ఇక చాలామంది నా ఆస్తి కోసం వచ్చారు కానీ పవిత్ర అలా కాదు మాది పవిత్రమైన బంధం అంటూ ఈయన కామెంట్ చేశారు.
Actor Naresh: నరేష్ ఆస్తి విషయాలు నాకు తెలియదు…
ఇలా నరేష్ తనది పవిత్ర ది చాలా పవిత్రమైన బంధం అంటూ కామెంట్ చేయడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్లపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేష్ తో ఇప్పటికే నాకు పెళ్లి జరిగిపోయిందన్న ఫీలింగ్ తనలో ఉందని చివరి వరకు మా బంధం ఇలాగే కొనసాగుతుందని ఇక నరేష్ ఎవరి వైపు కూడా చూడరు అంటూ పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇకపోతే తనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనే విషయం తనకు ఇప్పటికీ ఏమి తెలియదని ఆస్తి కోసమే తన వెంట వచ్చాను అంటూ చేసిన కామెంట్స్ తనని బాధపెట్టాయని పవిత్ర తెలియజేశారు.