Actor Naresh: నరేష్ ,పవిత్ర లోకేష్ , రమ్య మధ్య పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తిన సంగతి మనకు తెలిసిందే. నటుడు నరేష్ రమ్య రఘుపతి వైవాహిక బంధం చెడిపోవడానికి కారణం పవిత్ర లోకేష్ అంటూ రమ్య రఘుపతి దారుణమైన కామెంట్లు చేశారు. అయితే రమ్య పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయంపై నరేష్ స్పందిస్తూ రమ్య అసలు విషయం బయట పెట్టారు.ఇప్పటివరకు రమ్య గురించి బయట పెట్టన విషయాలను కూడా ఈయన చెబుతూ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా నరేష్ స్పందిస్తూ రమ్య ఏ రోజు కూడా తనతో ఒక భార్యలా ప్రవర్తించలేదని తెలిపారు.
ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా, శుభకార్యాలు జరిగిన ఈమె మేల్ క్యాబర్ డాన్సర్ నుఇంటికి పిలిపించుకుంటుందని ఈయన తన మూడవ భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా అనిపించే కొన్ని పనులను కూడా రమ్య చేసిందని, తను నా కారు డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఈయన తన భార్య గురించి సంచలన నిజాలు బయటపెట్టారు.ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఏవేవో వివరణలు చెబుతుందని నరేష్ ఈ సందర్భంగా రమ్య గురించి ఓపెన్ అయ్యారు.

Actor Naresh: హాట్ టాపిక్ గా మారిన నరేష్ కామెంట్స్…
ఈ విధంగా రమ్య చేష్టల వల్ల ఎంతో విసిగిపోయాను. ఈమె ప్రవర్తన చేయి జారిపోవడంతో చేసేదేమీ లేక తనకు విడాకులు ఇచ్చానని ఈ సందర్భంగా నరేష్ రమ్య గురించి సిగ్గు విడిచి అన్ని విషయాలను బయటపెట్టారు.అయితే ఈ విధంగా తన మూడవ భార్య గురించి నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.మరి ఈ వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు అయితే ఈ వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై రమ్య స్పందించాల్సి ఉంది. మొత్తానికి నరేష్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.