Actor Naresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయనిర్మల వారసుడిగా నరేష్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈయన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కెరియర్ మొదట్లో ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన నరేష్ ప్రస్తుతం పలు సినిమాలలో తండ్రి పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో ముందుకు వెళుతున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన వ్యక్తిగత విషయానికొస్తే ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో తరచు వినబడుతూనే ఉంటాయి.ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన పలు మనస్పర్థల కారణంగా ముగ్గురికి విడాకులు ఇచ్చారని, అయితే ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్న నరేష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మరొక నటితో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ నటి పవిత్ర పలు సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.

Actor Naresh: పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న నరేష్..
ఈ క్రమంలోనే నరేష్ నటి పవిత్రతో సహజీవనం చేస్తున్నారని వీరిద్దరూ కలిసి పార్టీలు,వెకేషన్స్ అంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారని సమాచారం. అయితే నటి పవిత్ర తన భర్తతో ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదు. దీంతో ఈమె మరొక వివాహం చేసుకోవడానికి అసలు చిక్కు ఏర్పడింది.నటి పవిత్రకు తన భర్త నుంచి విడాకులు వస్తే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.అయితే నటుడు నరేష్ నటి పవిత్ర గురించి వస్తున్నటువంటి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.