Actor Nirupam: నిరుపమ్ అంటే చాలామందికి టక్కున గుర్తుకు రాకపోయినా డాక్టర్ బాబు అంటే ప్రతి ఒక్కరు ఇట్టే గుర్తు పడతారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బాబు ( నిరుపమ్) ప్రస్తుతం ఈ సీరియల్ కు దూరం కావడంతో ఎంతో మంది అభిమానులు ఈయనను మిస్ అవుతున్నారు.ఇలా బుల్లితెర సీరియల్స్ కి దూరమైన ఈయన తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక వీడియో ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో ఏం షాపింగ్ చేసిన వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే తాజాగా మంజుల డాక్టర్ బాబు షాపింగ్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
త్వరలోనే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండడంతో మంజుల డాక్టర్ బాబుతో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నగలను కొనుగోలు చేయడానికి వెళ్లిన మంజుల ఏకంగా డాక్టర్ బాబు చేత ఏడువారాల నగలు కొనిపించింది.ఇలా మంజుల ఏడువారాల నగలు కొనుగోలు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఏడు వారాల నగలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేసినవి కాదు. 92.5 స్వచ్ఛమైన వెండి ఆభరణాలకు గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు.
Actor Nirupam: వెబ్ సిరీస్ లో నటిస్తున్న డాక్టర్ బాబు…
ఇలా ఏడువారాల నగలు కొనుగోలు చేసిన మంజుల తన నగలకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ విధంగా తన భార్యకు నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు అమ్మాయిలకు ఎప్పటికీ బట్టల షాపింగ్ చేయడం, నగలు షాపింగ్ చేయాలని పిచ్చి తగ్గదు అంటూ కామెంట్ చేశారు. ఇలా డాక్టర్ బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే బుల్లితెర సీరియల్స్ కి దూరమైన డాక్టర్ బాబు తిరిగి సీరియల్స్ లో నటించనని అయితే తాను సీరియల్స్ ను నిర్మిస్తానని తెలిపారు. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నానని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ గురించి అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.