Actor Raj Kumar: సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇలా ఒకరిని పోలిన వారు ఒకరు ఉండటం మనం చూస్తూనే ఉంటాము. అలాగే కొందరు హీరో, హీరోయిన్లను పోలిన మనుషులు కూడా ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు హీరో చిరంజీవిని పోలిన వ్యక్తి కూడా ఉన్నారు. అతను మరెవరో కాదు ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించి నటుడిగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజ్ కుమార్. ప్రస్తుతం జననీ సీరియల్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రాజ్ కుమార్ తాజాగా తాను చిరంజీవిలా ఉండటమే తనకు శాపం అయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
30 ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రాజకుమార్ మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ మాట్లాడుతూ.. “చిరంజీవిలా ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్ల ఇండస్ట్రీలో పైకి వెళ్లలేక జూనియర్ చిరంజీవి గానే మిగిలిపోయానని తెలిపాడు. ప్రతి హీరోకి బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. అయితే నాకు బ్రేకింగ్ పాయింట్ వచ్చే సరికి నేను చిరంజీవిలా ఉంటానని ఫీల్డ్ లో తెలిసిపోయింది. అలా ఉండటం బయట వారికి బాగుంటుంది, కానీ ఇండస్ట్రీలో మాత్రం నాకు మైనస్ గా మారింది అంటూ తెలిపాడు.
Actor Raj Kumar: చిరంజీవి పోలికలతో ఉండడమే నాకు మైనస్ పాయింట్..
చిరంజీవి పోలికలతో ఉండటం వల్ల ఇండస్ట్రీలో నా పరిస్థితి మర్రిచెట్టు కింద కలుపు మెుక్కలా మారింది. ఆయనలా ఉండటం వల్లే నేను తెలుగు ఇండస్ట్రీ వదిలేసి కర్ణాటకు వెళ్లిపోయాననీ ఆ క్షణమే చిరంజీవి గారు నన్ను తొక్కేసారని వార్తలు వచ్చాయి అందులో ఏమాత్రం నిజం లేదని ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ.. తొక్కేస్తే.. అసలు నేను టీవీలో కనిపించే వాడినే కాదు. నన్ను ఆయన తొక్కేయడం ఏంటి?” అంటూ రాజ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.