ఎంత మాజీ హీరో అయితే మాత్రం సినిమాలపై ట్రోల్ ఏంటి బాసు.. మాజీ హీరో రాజాపై విమర్శలు!

Akashavani

తెలుగు ప్రేక్షకులకు హీరో రాజా అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ ఆనంద్ సినిమాలో హీరో అంటే ఎవరైనా ఇట్టే గుర్తు పడతారు. ఆ సినిమాతోనే రాజా తెలుగు ప్రేక్షకులతో మంచి రాపో పెంచుకున్నాడు. ఆ తర్వాత కల, మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు సినిమాలతో రాజా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాడు.

మొత్తానికి రాజా ఇండస్ట్రీలో నటుడిగా అడపా దడప తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొంతకాలం హీరో రోల్ కు గుడ్ బై చెప్పిన రాజ.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసాడు. ఆ తర్వాత నుంచి రాజా పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. అతడు క్రిస్టియన్ అయినందున పూర్తిగా మత ప్రచారకుడిగా మారిపోయాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజా కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రాజా సినిమాలను విమర్శించి నట్టుగా పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. శుక్రవారం వచ్చింది మార్నింగ్ షో ఎంత పట్టుదలతో.. ఫస్ట్ డే ఫస్ట్ షో చుడానికి. కానీ లాస్ట్ డే మనకు దేవుడు చూపిస్తాడు. సినిమా అబ్బా.. అబ్బా చాలా అద్భుతంగా ఉండబోతుంది.

ప్రార్థించండి అయ్యా.. ఆ పనికి మాలిన సినిమాలు చూడడం వల్ల మీకేం లాభం లేదయ్యా అని చెప్పుకొచ్చాడు. గంట సేపు లైన్ లో నిలబడి మూడు గంటలసేపు సినిమా చూసే బదులు ఆ నాలుగు గంటల మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మీ బ్లడ్ రిలేటివ్స్ కు, ప్రపంచంలో సమాధానం కోసం ప్రార్థన చేయండి అని తెలిపాడు.

Hero Raja: హీరో రాజా సినిమాల గురించి ఈ విధంగా విమర్శించాడు!

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు హీరో రాజా ను కామెంట్ల రూపంలో కడిగేస్తున్నారు. దాదాపు 30 సినిమాల్లో నటించిన.. నువ్వే చెప్పాలి అంటూ దెప్పి పొడుస్తున్నారు. మరి కొందరు ఎంత మాజీ హీరో అయితే మాత్రం సినిమాల పై ట్రోల్స్ ఏంటి? బాసు అంటూ ఆడుకుంటున్నారు.

- Advertisement -