Actor Rana: సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రానా ఒకరు.లీడర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రానా ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.
ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వెంకటేష్ రానా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఈ వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రానా తాను ఎదురుకుంటున్నటువంటి అనారోగ్య సమస్యల గురించి ఓపెన్ అయ్యారు. గతంలో రానా కంటిచూపు సమస్యతో బాధపడుతున్నారని అలాగే ఈయన కిడ్నీ సమస్యతో కూడా బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి. కిడ్నీ సర్జరీ నిమిత్తం ఈయన విదేశాలకు వెళ్లారంటూ కూడా పలు వెబ్ కథనాలు వెలువడ్డాయి.
Actor Rana: కుడి కన్ను కనిపించేది కాదు…
ఈ క్రమంలోనే రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా రానా తన అనారోగ్య సమస్యల గురించి స్పందించారు. తనకు చిన్నప్పుడు కుడి కన్ను అసలు కనిపించేది కాదని తనకు చిన్నప్పుడే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో కన్నుకు సర్జరీ జరిగిందని తెలిపారు. అదేవిధంగా తనకు క్రమక్రమంగా కిడ్నీ సమస్య కూడా వచ్చిందని తెలిపారు. అయితే తనకు కిడ్నీ మార్పిడి కూడా జరిగిందని రానా ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా కన్ను కిడ్నీ రెండింటికీ సర్జరీలు జరిగాయని రానా ఈ సందర్భంగా తెలిపారు. ఇకపోతే మనకు ఏదైనా సమస్య వచ్చిందంటే దానినే తలుచుకొని అక్కడే కూర్చోకూడదని ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి ముందడుగు వేయాలంటూ ఈ సందర్భంగా రానా పలువురికి స్ఫూర్తిదాయకమైన మాటలను తెలియజేశారు.