Sharwanand: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ హీరో శర్వానంద్ ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకుంటూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి శర్వానంద్ గత కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈయన ఈ ఏడాది జూన్ నెలలో రక్షిత రెడ్డి అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేశారు వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఎంతో ఘనంగా జరిగింది. ఇలా రక్షిత అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకున్నటువంటి ఈయన గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శర్వానంద్ త్వరలోనే తండ్రి కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రక్షిత అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఈయనకు సినిమా షూటింగ్ లేని సమయంలో అమెరికాలోనే ఉంటున్నారు.
అమెరికాలోనే డెలివరీ…
ఇక రక్షిత ప్రస్తుతం తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక వీరి డెలివరీ కూడా అమెరికాలోనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ విధంగా శర్వానంద్ తండ్రి కాబోతున్నారు అంటూ ఈ వార్త వైరల్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పెళ్లి చాలా ఆలస్యంగా చేసుకున్న పిల్లలను మాత్రం చాలా తొందరగా ప్లాన్ చేసుకున్నారు మంచి నిర్ణయమే అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈమె ప్రెగ్నెన్సీ వార్తల గురించి ఇప్పటివరకు తమ కుటుంబ సభ్యులు కానీ శర్వానంద్ కానీ ఎలాంటి అధికారక ప్రకటన తెలియజేయలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.