Actor Sudhakar: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తొందరగా స్ప్రెడ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఆ వార్తలు నిజమా అబద్దమా అన్న విషయాన్ని కూడా గుర్తించకుండా ఆ వార్తలను వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు తలెత్తాయి. అయితే తాజాగా నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.
అయితే సుధాకర్ గురించి ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు.గతంలో ఈయన ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో ఈయన చనిపోయారు అంటూ కూడా వార్తలు రాశారు. ఇలా ప్రతిసారి తన గురించి వార్తలు వస్తూ ఆ వార్తలు వైరల్ కావడంతో చివరికి సుధాకర్ ఆ వార్తలపై స్పందిస్తూ నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అయితే తాజాగా మరోసారి ఈయన అనారోగ్యం క్షీణించింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.
Actor Sudhakar: ఆరోగ్యం చాలా బాగుంది..
ఈ క్రమంలోనే ఈ వార్తల పై స్పందించిన సుధాకర్ ఒక వీడియోని విడుదల చేస్తూ తాను క్షేమంగా ఉన్నానని తన ఆరోగ్యం బాగుందని తెలియజేశారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే ఈ అసత్యపు వార్తలు నమ్మకండి అంటూ ఈ సందర్భంగా ఈయన తన ఆరోగ్యం గురించి వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా ఖండిస్తూ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ వీడియోతో అయినా సుధాకర్ ఆరోగ్యం గురించి వచ్చే వార్తలకు చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.