Actor Suman: మనదేశంలో సినిమాలకు రాజకీయాలకు ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉందని చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారందరూ కూడా రాజకీయాలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు రాజకీయాలలో ఉన్నత పదవులను అధిరోహించారు.ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు సుమన్ సైతం రాజకీయాల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామంలో బుధవారం నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సుమన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సుమన్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి వస్తానని తేల్చి చెప్పారు.అయితే రాజకీయాలలోకి వస్తే తన మద్దతు ఏ పార్టీకి ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు.
Actor Suman: బిఆర్ఎస్ పార్టీకే నా మద్దతు..
ఈ క్రమంలోనే సుమన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను కూడా రాజకీయాలలోకి వస్తానని అయితే రాజకీయాలలోకి కనుక వస్తే తెలంగాణలో తాను బిఆర్ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటిస్తానని తెలియజేశారు.అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పిన సుమన్ రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.ప్రతి ఏడాది ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయని అయితే ఆ దిశగా వాటిని అరికట్టడం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాజకీయ నాయకులను కోరారు.ఇలా సుమన్ తాను రాజకీయాలలోకి వస్తానంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.