Actor Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు సూర్య ఒకరు.ఇలా ఈయనకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో ఫాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. ఇలా దక్షిణాది సిని ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు సూర్య గురించి తాజాగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నటుడు సూర్య తన కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఈయన కుటుంబం నుంచి వేరుగా ఉండాలని భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈయన తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇలా తన భార్య పిల్లలతో కలిసి సూర్య ముంబైలో నివసించడం కోసం ఒక ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి.
Actor Suriya: ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్న సూర్య…
ఈ క్రమంలోనే నటుడు సూర్య ముంబైలో సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతమైన గేట్ కమ్యూనిటీలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలుస్తుంది.దాదాపు తొమ్మిది వేల అడగల చదరపు విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ కోసం సూర్య 68 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే ఈ అపార్ట్మెంట్ బుకింగ్ కోసం ఇతరత ఖర్చులు కలిపి దాదాపు 70 కోట్ల వరకు సూర్య ఈ అపార్ట్మెంట్ కోసం ఖర్చు పెట్టారని తెలుస్తుంది. ఇలా ముంబైలో అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సూర్య త్వరలోనే తన భార్య జ్యోతిక ఇద్దరు పిల్లలతో కలిసి ముంబై కి షిఫ్ట్ అవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.