Actor Suriya: ప్రముఖ తమిళ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల చేయటంతో ఇక్కడ కూడా సూర్య మార్కెట్ బాగా పెరిగింది. ఎంతోమంది తెలుగు ప్రజలు సూర్యకి అభిమానులుగా మారిపోయారు. హీరోగా మంచి గుర్తింపు పొందిన సూర్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. ఇలా సినిమాల వల్ల మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల వల్ల కూడా సూర్యకి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉండగా సూర్య తమ్ముడు కార్తీ కూడా ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలలో హీరోగా మంచి గుర్తింపు పొందాడు . ఇదిలా ఉండగా తాజాగా సూర్య, కార్తీల గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సూర్య కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మొదలయ్యాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూర్యకి తన తండ్రికి మద్య విబేధాలు ఏర్పడ్డాయని సమాచారం. అంతే కాకుండా సూర్య, కార్తీ మద్య కూడా మనస్పర్ధలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇలా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు రావడానికి ఒక విధంగా జ్యోతిక కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.
Actor Suriya: ముంబైలో స్థిరపడనున్న సూర్య..
సూర్య జ్యోతికని ప్రేమించే వివాహం చేసుకున్నాడు. అయితే సూర్య ఆమెను వివాహం చేసుకోవడం ఆయన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లికి అంగీకరించారు. ఇక పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు పూర్తిగా దూరమైంది. అయితే ఇటీవల మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే జ్యోతిక ఇలా మళ్లీ సినిమాలలోకి అడుగుపెట్టడం సూర్యా తండ్రికి ఏమాత్రం నచ్చలేదని దీంతో ఆ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విభేదాల వల్ల సూర్య తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సూర్య తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో మఖాం పెట్టనున్నట్లు తెలుస్తోంది.