Roja : తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ సీనియర్ హీరోయిన్ రోజా గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి రోజా సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొంది, పలు మంచి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సేవ చేస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో మంచి వాడి వేడి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రోజా కూడా తనపై లేదా తన పార్టీపై వ్యాఖ్యలు చేసిన వారికి గాటుగానే రిప్లై ఇస్తుంది. అసలే ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ఆక్టివ్ గా ఉంటూ మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందిస్తోంది. కాగా ఇటీవలే ఓ జబర్దస్త్ కమెడియన్ వైసిపి పార్టీపై చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపై నటి రోజా ఘాటుగా స్పందించింది.
ఇందులో భాగంగా ఇలాంటి చిన్నాచితకా ఆర్టిస్టులు చేసిన వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోనని కానీ వారి వెనుకనుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్న వారికి మాత్రం కచ్చితంగా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నానని తెలిపింది. అలాగే సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఉన్నారని దాంతో వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఆఫర్లు లేకుండా చేస్తారని చాలామంది చిన్నచిన్న ఆర్టిస్టులు వారికి సపోర్ట్ చేస్తున్నారని అంతేతప్ప తమపై ప్రేమ భయం అభిమానం వంటివి లేవని స్పష్టం చేసింది. అలాగే సినిమాలు వేరు రాజకీయాలు వేరని సినిమా చూసిన ప్రతివాళ్ళు తమ అభిమాన ఉన్నటుడు ఎన్నికల్లో నిలబడితే ఓటు వేయరని కూడా ఎద్దేవా చేసింది.
ఇక తమపై వ్యాఖ్యలు చేసిన చిన్న ఆర్టిస్టులు గురించి ఆలోచించే సమయం లేదని అలాంటి వాటిని అస్సలు పట్టించుకోని కూడా స్పష్టం చేసింది. ప్రజలకి తమపై ఉన్నటువంటి ప్రేమ కారణంగానే తాను ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని అంతేతప్ప ఎవరో దయ దక్షిణ్యాలు మీద కాదని అది అందరూ తెలుసుకుంటే మంచిదని కూడా వార్నింగ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం నటి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి రోజా నటనకి బ్రేక్ ఇచ్చి తన నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాజకీయాల్లో బిజీగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తు కార్య చరణ పై చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది.