Actress Archana: ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటీమణులు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తిరిగి పలు సినిమాలలో హీరో హీరోయిన్ తల్లి పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు,తమిళ కన్నడ మళయాళ చిత్రాలలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించిన నటి అర్చన తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చోర్ బజార్ చిత్రం ద్వారా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇక ఈ సినిమా ఈ నెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్చన ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చోర్ బజార్ సినిమా కలర్ ఫుల్, కమర్షియల్ సినిమా. ఇందులో తాను తన జానర్ దాటి నటించానని అర్చన తెలిపారు.అయితే గత కొంత కాలం నుంచి ఇండస్ట్రీకి దూరం కావడానికి ప్రధాన కారణాలు ఏమీ లేవని చివరకు తాను నటించిన సినిమాల్లో నటిగా సంతృప్తి ఉండటం వల్లే తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని తెలిపారు.

Actress Archana: నా జానర్ దాటి చోర్ బజార్ సినిమాలో నటించాను…
ఇకపోతే జీవన్ రెడ్డి చోర్ బజార్ సినిమా కోసం తనని కలవడానికి వచ్చినప్పుడు తనకు సినిమాల్లో నటించడం పెద్దగా ఆసక్తి లేదని చెప్పాను.అనంతరం మనసు మార్చుకుని ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుంది? ఎవరికీ తల్లిగా నటించాలి? ఎవరికీ వదినగా నటించాలని దర్శకుడిని అడగగా మీరు ఎవరికీ తల్లిగా, వదినగా నటించాల్సిన పని లేదు. మీ పాత్రకు సొంత వ్యక్తిత్వం మీ కంటూ ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుందని దర్శకుడు జీవన్ రెడ్డి తెలిపారు.ఆ సమయంలో సినిమా గురించి ఒక లైన్ చెప్పమని అడగగా దర్శకుడు మీరు అమితాబచ్చన్ కు పెద్ద ఫ్యాన్.. ఆయననే ప్రేమిస్తూ ఉంటారు.అతని కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటారు. మీ పాత్ర ఇలా ఉండబోతుంది అంటూ జీవన్ రెడ్డి తెలిపారు.ఆయన ఇలా చెప్పగానే ఒక్క క్షణం ఆలోచించకుండా సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని అడిగాను అంటూ ఈ సందర్భంగా నటి అర్చన చోర్ బజార్ సినిమాలో తన పాత్ర గురించి బయట పెట్టారు.