Actress Hansika: దేశముదురు చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది శరీరం కాదు మట్టి అంటూ ఆమె చెప్పిన డైలాగ్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. కోయి మిల్ గయా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించిన హన్సిక చాలా త్వరగానే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
అంత షార్ట్ పీరియడ్లో హీరోయిన్గా మారడం అప్పట్లో అందరికీ చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. బాలనటి నుంచి హీరోయిన్ గా మారటానికి ఆమెకి కేవలం నాలుగు సంవత్సరాల సమయం మాత్రమే తీసుకుంది. ఇంత తక్కువ సమయంలో హీరోయిన్ గా మారటానికి ఆమె హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందని అప్పట్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అందుకు కారణం ఆమె తల్లి మోనా మోత్వాని వైద్యురాలు కావడం కూడా.
చాలా త్వరగా యువతిగా ట్రాన్స్ఫమ్ అవ్వటం కోసం హన్సిక ఆమె తల్లి సహాయం కూడా తీసుకుందని అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం గురించి వాళ్ళిద్దరూ పెద్దగా పట్టించుకోలేదు, అలా అని ఆ వార్తలను ఖండించనూ లేదు. ఇక ఆ సమయంలో తన ప్రేమ వ్యవహారంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది. తమిళ నటుడు శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన హన్సిక అతడినే పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అదంతా అక్కడికే ముగిసిపోయింది. తర్వాత కెరీర్ పై మళ్లీ దృష్టి పెట్టింది.
ఇక తన స్నేహితురాలికి విడాకులు ఇచ్చిన తన చిరకాల మిత్రుడు సోహెల్ కథురియాను 2022లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చింది హన్సిక. ఒక పెళ్లి అయినా మగవాడిని పెళ్లి చేసుకోవటం పాపం అంటూ బాగా విమర్శలు చేశారు. ఇక తన పెళ్లి వీడియోను స్పెషల్ షో గా హాట్ స్టార్ లో కూడా వేసింది.
ఇక హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న లవ్ షాది డ్రామాలో తన పెళ్లి గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ అప్పట్లో వచ్చిన ఈ హార్మోన్స్ ఇంజక్షన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చింది హన్సిక.
తను ఎలాంటి హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకోలేదని అప్పట్లో తన మీద వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనని అలాంటి వార్తల వల్ల తను చాలా ఇబ్బంది పడినట్లుగా చెప్పుకొచ్చింది హన్సిక.
Actress Hansika:
ఒక్కసారి హార్మోన్స్ ఇంజక్షన్స్ స్టార్ట్ చేస్తే అవి ఇప్పటికీ వాడుతూనే ఉండాలి కానీ అలా జరగలేదు. అంతకన్నా బాధపెట్టిన విషయం ఏంటి అంటే నా శరీరం ఎదుగుదల కోసం నా తల్లి సహకరించింది అనటం అని చెప్పుకొచ్చింది. ఇక వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా రాసి పారేశారు. కానీ.. అవతల వాళ్ళ ఫీలింగ్స్ తో వాళ్లకి సంబంధం లేదు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదే విషయంపై స్పందిస్తూ ఆమె తల్లి మోనా మోత్వాని కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. హార్మోన్స్ ఇంజక్షన్ ఇవ్వటం అనేది మామూలు మధ్యతరగతి వ్యక్తులకు సాధ్యం కాదని అలాంటి ఇంజక్షన్స్ చేయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అంత స్తోమత తమకు లేదు అని చెప్పుకొచ్చారు. సాధారణంగానే పంజాబీల్లో శరీర పౌష్టికత ఎక్కువగా ఉంటుందని. పంజాబీలో ఆడపిల్లలు సాధారణంగానే వయసుకు మించి శరీర సౌష్టవాన్ని కలిగి ఉంటారని చెప్పుకొచ్చారు.