Actress Inaya Sultana : నటి ఇనయ సుల్తానా ఈ పేరు గురించి పరిచయము అవసరం లేదు. ఈమె పలు సినిమాలలో నటించి గుర్తింపు పొందిన దానికన్నా వర్మతో చేసిన డాన్స్ వీడియోతో ఒక్కసారిగా పాపులర్ అయింది. నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె సినిమాపై మక్కువతో ఇంట్లో వారికి కూడా చెప్పకుండా హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం ఎదురు చూశారు. ఇలా అవకాశాల కోసం ఎదురుచూసిన షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అయితే వర్మ గారితో పరిచయం ఏర్పడటంతో తన పుట్టినరోజు సందర్భంగా తనని పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించాలని ఈమె ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
ఇకపోతే వర్మ గారు బర్త్ డే పార్టీలో నాతో కలిసి డాన్స్ చేశారు.నా బర్త్ డే అయిపోయిన తర్వాత నాలుగు రోజులకు బాగా వైరల్ అయిందని ఆ సమయంలో తన తల్లి ఫోన్ చేసి కుటుంబ పరువు మొత్తం తీస్తున్నావు అంటూ తనని బాగా తిట్టారని ఇంటర్వ్యూ సందర్భంగా ఇనయ సుల్తానా వెల్లడించారు.అప్పటినుంచి నా కుటుంబం నన్ను పూర్తిగా ద్వేషించడమే కాకుండా దూరం పెట్టిందని ఈమె ఈ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. నేను కేవలం వర్మ గారితో డాన్స్ మాత్రమే చేశాను ఎలాంటి పో** వీడియోలు చేయలేదని ఆయనప్పటికీ తన కుటుంబం తనని ఇలా ద్వేషంగా చూడడమే కాకుండా తనతో మాట్లాడటం కూడా మానేసారని ఎమోషనల్ అయ్యారు.
Actress Inaya Sultana : కుటుంబం మొత్తం ద్వేషించారు…
ఈ విధంగా తన కుటుంబం తనని దూరం పెట్టి ద్వేషించడంతో తాను కూడా తన కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోవడం లేదని తెలిపారు. ఇకపోతే ఈ వీడియోలో భాగంగా వర్మ ఈమెతో కలిసి రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఈ విషయంపై వర్మ మాట్లాడుతూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, అలాగే హీరోయిన్ ఇనయ సుల్తానా కూడా కాదని..అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మీద ఒట్టు నన్ను నమ్మండి అంటూ గతంలో ఈ వీడియో పై వర్మ చేసిన ట్వీట్ బాగా వైరల్ అయింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆ వీడియో గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.