Actress Indraja: తెలుగు సినీ నటి,సీనియర్ హీరోయిన్ ఇంద్రజ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ అప్పట్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.ఇది ఇలా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలకు జడ్జిగా వ్యవహరించడంతోపాటు అప్పుడప్పుడు తనదైన సెల్లులో పంచులు కూడా వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటుంది.
అయితే మొదట్లో కామెడీ షోలకు గెస్ట్ గా వచ్చిన ఇంద్రజ ప్రస్తుతం ఫుల్ టైం జడ్జిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఇంద్రజ బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాల్లో కూడా నటిస్తుందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం రెండు మూడు సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది. అందులో నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గ సినిమా ఒకటి, అలాగే లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా నటిస్తోందట. అయితే ఆ సినిమాలో పూర్తిగా తెలంగాణ భాష మాట్లాడుతూ పటేలమ్మ అనే పాతలో నటిస్తోందట. కొత్త డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాను అని తెలిపింది ఇంద్రజ.

Actress Indraja: త్రివిక్రమ్ ను పొగడ్తలతో ముంచెత్తిన ఇంద్రజ..
ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మీరు నటించని మీకు నచ్చిన సినిమా ఏది అని అడగగా.. ఆ విషయం పై స్పందించిన ఇంద్రజ నాకు బాగా నచ్చిన సినిమా ఖలేజా. త్రివిక్రమ్ గారు ఆ సినిమాకు ఎంతో బాగా దర్శకత్వం వహించారు. అయితే కేవలం ఈ మూవీ మాత్రమే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఏ మూవీలో అయినా కూడా సినిమా లోపల ఆధ్యాత్మికం విషయం ఒకటి ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక విషయమే సినిమాలో మెయిన్ పాయింట్ అయి ఉంటుంది తెలిపింది ఇంద్రజ. త్రివిక్రమ్ గారు ఎంత డీప్ తాట్ ఉన్న వ్యక్తి అనేది చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమవుతుంది. త్రివిక్రమ్ గారు వన్ అఫ్ ద బెస్ట్ థాట్ ప్రోవోకింగ్ డైరెక్టర్ అని తెలిపింది ఇంద్రజ. త్రివిక్రమ్ సినిమాలలో ప్రతి సినిమాలలో కూడా ఎక్కడో ఒకచోట చిన్న ఆధ్యాత్మిక పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ చిన్న పాయింట్ చుట్టే కథ ఉంటున్నప్పటికీ, సినిమా మొత్తం ఎంటర్టైన్ గా చాలా హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోతుంది అని తెలిపింది ఇంద్రజ. నిజం చెప్పాలి అంటే ఆ పాయింట్ డీప్ గా ఎమోషనల్ గా టచ్ అవుతూ వెళ్ళిపోతుంది అని తెలిపింది ఇంద్రజ.