Actress Jamuna: అలనాటి స్టార్ హీరోయిన్ జమున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జమున ఆ తర్వాత హీరోయిన్గా మారి ఎన్నో వందల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చిన్నప్పటి నుండి నాటకాల పట్ల ఆసక్తి ఉన్న జమున నాటకాలు వేయటంతో సినిమా అవకాశాలు వచ్చాయి. అలాగే చిన్నప్పటి నుండి సంగీతం కూడా నేర్చుకుంది. ఇక సినిమాలలో అడుగుపెట్టాక ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఇలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జమున నేడు తుది శ్వాస విడిచారు.
ఈమె ఎక్కువగా సత్యభామ పాత్రలో నటించి ఆ పాత్రకు తనను మించి ఎవరూ న్యాయం చేయలేరు అనేంతగా ఆ పాత్రలో లీనమై నటించి సత్యభామ పాత్రకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. హీరోయిన్ గా గుర్తింపు పొందటమే కాకుండా సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసి మంచి మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందింది. ఇలా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా కొన్ని సందర్భాలలో నిర్మాతలు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టినా కూడా జమున వారిని ఏమీ అనకుండా సర్దుకుపోయేది. ఇలా ఎన్నో సినిమాలకు నిర్మాతలు డబ్బు ఇవ్వకుండా మోసం చేయటంతో చాలా నష్టపోయింది.
Actress Jamuna: సినిమాలు ఫ్లాప్ అయితే మరో సినిమాకు కాల్ షీట్లు ఇచ్చేవారు…
ఇప్పటి హీరోయిన్ల లాగా సినిమాలు ప్రారంభించడానికి ముందే రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా పూర్తయిన తర్వాత రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కొన్ని సందర్భాలలో సినిమాలు ప్లాప్ అయినా కూడా ఆ సినిమాలకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేయటానికి మరో సినిమాకు కూడా జమున కాల్షీట్లు ఇచ్చిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా, సినిమా నష్టపోయిన మళ్లీ కాల్షీట్లు ఇవ్వటం వల్ల నిర్మాతలు కూడా జమునకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చేవారు. జమున నిర్మాతల నటీమణిగా పేరు సంపాదించుకున్నారు.