Actress Jamuna: వెండితెర సత్యభామగా ఎంతో పేరు సంపాదించుకున్న జమున నేడు తుది శ్వాస విడిచారు. 86 సంవత్సరాల వయసు కలిగినటువంటి జమున నేడు ఉదయం హైదరాబాదులోని తన స్వగృహంలో మరణించారు.ఇకపోతే నటిగా సహాయ నటిగా ఈమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రలలో నటించి ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. నటనలు మహానటి సావిత్రి తర్వాత అదే స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.
ఇకపోతే చిత్ర పరిశ్రమ అన్న తర్వాత తొందరగా ప్రేమలో పడటం అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే జమున సైతం ఒక స్టార్ హీరో ప్రేమలో పడ్డారట. అయితే మరొక స్టార్ హీరో ఈమె విషయంలో ఇన్వాల్వ్ అవడంతో వీరి ప్రేమ కాస్త బ్రేకప్ అయిందని తెలుస్తోంది. అప్పట్లో రొమాంటిక్ హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న నటుడు హరినాథ్ తో ఈమె ప్రేమలో పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
Actress Jamuna: జమునను హెచ్చరించిన ఎస్వీ రంగారావు…
ఈ విషయం చిత్ర పరిశ్రమలో చెక్కర్లు కొడుతుండగా ప్రముఖ నటుడు ఎస్.వి.రంగారావు జమున వద్దకు వెళ్లి మీరు స్టార్ హీరోతో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే మీరు ఊహించిన విధంగా ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరో కారని నాలాగా ఒక తాగుబోతు అవుతారు జాగ్రత్త అంటూ ఈమెను హెచ్చరించాడట. అయితే ఎస్వీ రంగారావు ఈమెను హెచ్చరించినప్పటి నుంచి జమున హరినాథ్ ను దూరం పెడుతూ వచ్చారు. అయితే ఆయన ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేక చివరికి తాగుబోతుగా మారి అతి చిన్న వయసులోనే మరణించారు. అయితే జమున మాత్రం
1965లో జూలూరి రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇక వీరికి ఇద్దరు పిల్లలు కలరు.