Actress Jyothi Reddy: క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి నటిగా గుర్తింపు పొందిన జ్యోతి రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు జ్యోతి రెడ్డి సినిమాలలో కన్నా సీరియల్ ఆర్టిస్ట్ గానే అందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో విలన్ పాత్రలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన జ్యోతి రెడ్డి ఇప్పటికీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతోంది. దాదాపు 30 ఏళ్లకు పైగా నటిగా రాణిస్తున్న జ్యోతి రెడ్డి ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిరెడ్డి మాట్లాడుతూ..” తాను ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం భవనం వెంకట్రామిరెడ్డి మనవరాలినని చెప్పుకొచ్చింది. తాను 9 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో బాలనటిగా అడుగుపెట్టానని తెలిపింది. అంతే కాకుండా కాకుండా తనకు బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని కోరికగా ఉండేదని, డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సాధించానని చెప్పుకొచ్చింది. అయితే చిన్నవయసులోనే నటిగా గుర్తింపు పొందిన తన కోసం పెద్ద పెద్ద డైరెక్టర్ల పిఏలు ఇంటిముందు క్యూ కట్టేవారు. దీంతో అంత గొప్ప వాళ్ళు నటించమని అడిగితే నువ్వు వద్దంటావేంటి అని అమ్మ నాకు బ్రెయిన్ వాష్ చేసింది అంటూ చెప్పుకొచ్చింది.
Actress Jyothi Reddy: డైరెక్టర్ల పిఏలు క్యూ కట్టేవారు…
అలాగే తన చిన్ననాటి సంగతుల గురించి మాట్లాడుతూ చిన్నప్పుడు గుమ్మంలో కూర్చుని నిద్రపోతే అమ్మ బిందెడు నీళ్లు గుమ్మరించింది. ఇక అప్పటినుండి అమ్మ లేపకముందే నిద్రలేచే దాన్ని. కాలేజీకి షూటింగ్ కి లేట్ అవుతుంది అని అమ్మ చేత ఎప్పుడూ కూడా అనిపించుకోలేదు అంటూ జ్యోతి రెడ్డి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు అంటే తనకు ఎంతో ఇష్టమని, వారి గుర్తుగా అందరి పేర్లు టాటూ వేయించుకున్నానని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం “మధురానగరిలో” అనే ఒక సీరియల్లో కీలకపాత్రలో జ్యోతి రెడ్డి నటిస్తోంది.