Actress Kushboo: టాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా దక్షిణాదిలో మంచి పేరు సంపాదించుకున్న సిని నటి ఖుష్బూ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అప్పట్లో ఈమెకి మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఈమె కోసం అప్పట్లో గుడి కూడా నిర్మించారు అంటే ఆమె క్రేజ్ ఎలా ఉండేదో ఊహించుకోండి.
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి ఇక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది ఖుష్బూ. ఇప్పుడు కూడా గోపీచంద్ హీరోగా నటిస్తున్న రామబాణం సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రం మే 5న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుంటుందో, సోషల్ మీడియాలో కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంటుంది. తన అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పడంలో ముందుండే ఖుష్బూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లికి ముందే సెక్స్ గురించి బోల్డ్ గా మాట్లాడి చాలా వివాదాల్లో ఇరుక్కుంది కుష్బూ.
ఈ మధ్యనే తన తండ్రి తన మీద లైంగిక దాడి చేశాడని ధైర్యంగా చెప్పి అందరి దృష్టిలో నిలిచింది ఈ భామ. ఇక విషయానికి వస్తే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ తన మనసులో మాటని బయట పెట్టింది. అందరి అగ్ర నటులతోనూ జతకట్టిన ఈ భామ తన అభిమాన నటుడైన అమితాబచ్చన్ తో ఇప్పటివరకు జోడిగా నటించలేదంట.
Actress Kushboo:
తన ఆరాధ్య అభిమాన నటుడు అమితాబచ్చన్ అని, ఆయన పోస్టర్లు ఇప్పటికీ తన బెడ్రూంలో గోడలకి ఉంటాయని. ఆయన సినిమాలో బాలనటిగా నటించాను తప్పితే ఆయనకి జోడిగా నటించలేదని చెప్పుకొచ్చింది. చినీకమ్ సినిమాలో అమితాబ్ పక్కన జోడి కట్టే అవకాశం టబు ని వరించింది. ఆ అవకాశం తనకి రాలేనందుకు చాలా బాధపడిందట ఈ భామ. ఇక మీదట అయినా తన కోరిక తీరుతుందేమో చూడాలి. ఇప్పటికీ సినిమాలలో సహాయ పాత్రలు పోషిస్తూ, స్టేజి షోలలో జడ్జిగా పాల్గొంటూ తన క్రేజ్ ని మెంటైన్ చేస్తూ వస్తుంది ఖుష్బూ.