Actress Laila: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎగిరే పావురం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లైలా. మొదటి సినిమాతోనే తన అల్లరి పనులతోనూ చిలిపిగా నటిస్తూ అందరిని ఎంతో మంత్రముగ్ధుల్ని చేసిన లైలా ఒక్క సినిమాకే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇకపోతే లైలా నటించిన ఎగిరే పావురం సినిమా తర్వాత మరిన్ని సినిమా అవకాశాలను అందుకుంటు తెలుగులో బిజీ అయ్యారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైన లైలా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
లైలా గోవాలో జన్మించారు. ఈమె తండ్రి ఒక పైలెట్. లైలా తండ్రి ఒక అందమైన అమ్మాయిని చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారట. తన పేరు కూడా లైలా కావడంతో తనకు పుట్టిన కూతురికి కూడా తన పేరే పెట్టుకున్నారు. ఇక ఈమె పదవ తరగతి నుంచి మోడలింగ్ రంగంలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఉండేది. అయితే లైలా ఫోటోలు చూస్తున్న బాలీవుడ్ దర్శకుడు మహమ్మద్ ఆమె ఫోటోలను చూసి తనకు సినిమాలో నటించే అవకాశం కల్పించారట. అయితే సినిమా రంగంపై లైలాకు చెడు అభిప్రాయం ఉండటం వల్ల తాను సినిమాలలో నటించనని వెల్లడించారు.
Actress Laila: చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన లైలా…
ఇకపోతే మహమ్మద్ గారు అప్పటికే తాను చేస్తున్న సినిమా కోసం ఏకంగా 500 మంది అమ్మాయిలను రిజెక్ట్ చేశారట. ఇలా 500 మంది అమ్మాయిలను రిజెక్ట్ చేస్తున్న డైరెక్టర్ మహమ్మద్ స్వయంగా లైలాకు అవకాశం కల్పించారు. ఈ సినిమాతోనే మహమ్మద్ తన కుమారుడిని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే తన కుమారుడి హీరోగా దుష్మన్ కా దునియా సినిమాలో పట్టుబట్టి మహమ్మద్ గారు లైలాని ఈ సినిమాలో నటించేలా చేశారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ హీరోలు సైతం నటించారు. అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా హీరోయిన్ లైలాకు మంచి పేరు రావడంతో ఈమెకు వరుస అవకాశాలు వచ్చి ఎంతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు.