Actress Laya: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లయ. ఇలాతెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈమెదాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంటున్న సమయంలో ఈమె పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయారు.ఇలా భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడిన లయ తాజాగా ఇండియాకి తిరిగి వచ్చారు. ఇలా ఇండియాకి తిరిగి వచ్చిన లయ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో ఆమె ఏం జాబ్ చేసేవారు తన నెల జీతం ఎంత అనే విషయాలను తెలియజేశారు. 2006వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిన లయ 2011 నుంచి ఐటీ సెక్టార్ లో ఉద్యోగం చేసే వారని తెలుస్తుంది. ఇలా నాలుగు సంవత్సరాలు పాటు ఫుల్ టైం జాబ్ చేశానని, ఇండియాలో చెందిన ప్రముఖ సంస్థ తాను పని చేసినట్టు తెలిపారు. ఆ సమయంలో అన్ని టాక్స్ లు ఫోను తనకు నెలకు 12000 జీతం వచ్చేదని తెలిపారు.
Actress Laya: డాన్స్ స్కూల్ కూడా ప్రారంభించాను…
ఇక భారత కరెన్సీ ప్రకారం తనకు నెలకు9,60,000 వేల రూపాయల జీతం అని వెల్లడించారు. ఇలా నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఈమె అనంతరం జాబ్ మానేసినట్లు తెలిపారు.అనంతరం తాను డాన్స్ స్కూల్ పెట్టానని తెలిపారు. అయితే కరోనా రావడం చేత డాన్స్ స్కూల్ కూడా మూసేశానని లయ తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉన్నానని తెలియజేశారు. ఇలా చాలా కాలం తర్వాత తాను తిరిగి ఇండియా రావడం చాలా సంతోషంగా ఉందని అయితే హైదరాబాద్ రూపురేకులు మొత్తం మారిపోయాయని లయ తెలియచేశారు.నిజం చెప్పాలంటే న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాద్ చాలా అందంగా ఉందని ఈ సందర్భంగా లయ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.