Actress Laya: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి లయ. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె గణేష్ అనే వైద్యుడిని వివాహం చేసుకొని అమెరికా వెళ్లిపోయారు.అమెరికాలో ఎంతో ఫేమస్ డాక్టర్ ఈయనకు అమెరికాలో మూడు ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇలా లయకు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పాలి.
ఇలా వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నప్పటికీ లయ తిని కూర్చుని తన జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మరి ఈమె అమెరికాలో ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఈమె నెల సంపాదన ఏంటి అనే విషయానికి వస్తే గతంలో ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారట. అయితే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసిన లయ ప్రస్తుతం జోబి ఏవియేషన్ అనే ఎయిర్ బస్ సంస్థలో పని చేస్తూ కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇలా ఇక్కడ ఉద్యోగ ఉన్నటువంటి లయ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Actress Laya: జోబి ఏవియేషన్ ఉద్యోగిగా లయ..
ఈ విధంగా లయ జోబి ఏవియేషన్ లో ఉద్యోగం చేస్తూ నెలకు ఎంత జీతం అందుకుంటున్నారనే విషయానికి వస్తే ఈమె నెలకు10 లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారట. ఇలా ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు తన భర్త వ్యాపారాలను కూడా చూసుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో లయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయ్యారు. పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే తనకు ఏదైనా మంచి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో అవకాశం కనుక వస్తే తిరిగి తప్పకుండా సినిమాలలో నటిస్తానని లయ వెల్లడించిన సంగతి తెలిసిందే.