Actress Meena: నటి మీనా ఈ మధ్య కాలంలోనే తన భర్తను కోల్పోయిన విషయం మనకు తెలుస్తుంది. మీనా అగ్రతారగా ఉన్న సమయంలోనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నారు.ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీనా భర్త ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదట్లో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో విద్యాసాగర్ కి లంగ్స్ ఇన్ఫెక్షన్ అధికం కావడం వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి. లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ కావాలి. ఇలా బ్రెయిన్ డెడ్ పేషెంట్లు లేకపోవడంతో ఆయనకు మందుల ద్వారా వైద్యం అందించారు.
రోజు రోజుకు మీనా భర్త ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన గత నెల 29వ తేదీ మృతి చెందారు. ఇక మీనా భర్త మృతి వార్తతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయ్యింది. మీనా భర్త మరణం గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం ఆస్తి కోసమే మీనా తన భర్తను చంపిందని వార్తలు పుట్టుకొచ్చాయి.ఇలా మీనా భర్త మృతి గురించి ఎన్నో వార్తలు వస్తున్నా నేపథ్యంలో మీనా స్పందిస్తూ దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ నెటిజన్లను కోరారు. తాజాగా తన భర్త గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Meena మీనాకు ఆస్తి దక్కకుండా వీలునామా రాసిన విద్యా సాగర్…
మీనా భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ విదేశాలలో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించి వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తుంది. విద్యాసాగర్ ఏకంగా 250 కోట్లకు పైగా ఆస్తులను పోగు చేశారు. విద్యాసాగర్ మరణించిన తర్వాత ఆస్తికి సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. మీనా భర్త విద్యాసాగర్ తన ఆస్తులన్నింటినీ కూడా తన కూతురు నైనిక పేరుపై రాసి ఆస్తి మీనాకు చెందకుండా వీలునామా రాసారని వార్తలు వస్తున్నాయి. నైనిక మేజర్ అయిన తర్వాత తన ఆస్తి మొత్తం తనకు తన భర్తకు చెందేటట్లు వీలునామా రాశారని, అప్పటివరకు నైనిక గార్డియన్ గా ఉన్నవారు ఆస్తులను చూసుకోవాలని వీలునామాలు రాసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వైరల్ కావడంతో మరికొందరు ఈ వార్తలతో స్పందిస్తూ ఇదంతా కూడా వట్టి పుకార్లు మాత్రమేనని ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరుకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.