Actress Nadhiya: మిర్చి సినిమాలో ప్రభాస్ కి తల్లి పాత్రలలో నటించి ఎంతో మందిని ఆకట్టుకున్న నటి నదియా అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కు అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించిన ఈమెనుకు మంచి మార్కులు పడటమే కాకుండా ఏకంగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈమె వరస సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన నదియా ఒకానొక సమయంలో తమిళ మలయాళ భాషలలో అగ్ర హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
ఇలా తమిళ మలయాళ భాషలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు.ఇలా వివాహం అనంతరం నదియాకు సనమ్, జానా అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు. ఇలా పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైనటువంటి నదియా కొన్ని సంవత్సరాల పాటు విదేశాలలో స్థిరపడ్డారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం తిరిగి చెన్నైకి వచ్చినటువంటి నదియా ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడగా ఈమె కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
Actress Nadhiya: ఇండస్ట్రీలోకి వస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు…
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నదియా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అందుకే ఈమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు పెద్దగా బయట ఎక్కడ కనిపించవు.అయితే గత కొద్ది రోజుల క్రితం నదియా తన ఇద్దరు కుమార్తెలు తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు అసలు నదియా కూతుర్లు అంటే ఏమాత్రం నమ్మసక్యంగా లేదని ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లుగా ఉన్నారు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం మీ కూతుర్ల ముందు హీరోయిన్లు కూడా పనికిరారని ఇండస్ట్రీలోకి వస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నదియా కూతుర్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.