Nayanatara: తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ టాలెంటెడ్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయనతార ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరైన నటించి మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ కీ చెక్కేసి అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.
నయనతార, కోలీవుడ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా నయనతార అదే ఊపు తో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా నయనతార, విగ్నేష్ శివన్ ల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగు నెలలకి ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వెల్లడించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
దీంతో ఈ వివాదం కి సంబంధించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే విషయంపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు కూడా సిద్ధమవుతోంది. అంతే కాకుండా తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అయిన సుబ్రహ్మణ్యం దీనిపై స్పందిస్తూ వారిద్దరిని ఈ వివాదానికి సంబంధించిన వివరాలను కూడా కోరారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే విషయంపై నయనతార వివరణ ఇచ్చినట్టుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
Nayanatara: సరోగిట్ మదర్ ఆమెనే..
నయనతార విగ్నేష్ శివన్లకు ఇదివరకే ఆరు సంవత్సరాల క్రితం లీగల్ గా మ్యారేజ్ అయినట్లు రిజిస్టర్ అయింది. అందుకు సంబంధించిన పత్రాలు కూడా సబ్మిట్ చేశారు ఆయన ద్వారా దంపతులు. అదేవిధంగా ఇప్పుడు సరోగిట్ మదర్ గా ఉన్న ఆమె నయనతారకు దగ్గర బందువట. దుబాయ్ లో నయనతార కు సంబంధించిన బిజినెస్ లు అన్నీ కూడా ఆమెను చూసుకుంటారట. చెన్నైలోనే ఒక హాస్పిటల్లో ఆమె ట్విన్స్ బాయ్స్ కి జన్మనిచ్చినట్టు నయనతార తెలిపింది. మొత్తానికి ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.