Actress Poorna: ఈమధ్య కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ న్యూస్ వినిపిస్తున్నారు. ఇప్పటికే కాజల్ అగర్వాల్, ప్రణీత ఇలా చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నారు. ఇక తాజాగా మరో నటి పూర్ణ కూడా ఆ మధ్యనే పెళ్లి చేసుకోగా ఈ బ్యూటీ కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడ్ న్యూస్ వినిపించింది.
తెలుగు ఇండస్ట్రీలో నటిగా పూర్ణ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. శ్రీ మహాలక్ష్మి అనే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. అంతేకాకుండా అవును సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్ని సినిమాలలో అంతగా మెప్పించలేకపోయింది.
అలా కొంతకాలం అవకాశాలు రాకపోయేసరికి సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో బుల్లితెరపై ఢీ డాన్స్ షో లో జడ్జి గా చేసి బాగా సందడిగా చేసింది. ఇక ఈ షోలో ఉన్నంతకాలం పూర్ణ బాగా రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ మధ్య మళ్ళీ ఆమె టాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. అఖండ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించింది.
ఆ మధ్యనే దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆసీఫ్ అలీని తమ కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటి కోడలుగా అడుగుపెట్టాక పెళ్లి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది పూర్ణ. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను బాగా పంచుకుంటుంది.
Actress Poorna ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీ మూమెంట్ లో ఉన్న పూర్ణ..
యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోగా అందులో కూడా ఇప్పటికి చాలా విషయాలు పంచుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే మొత్తానికి పూర్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల గురించి ఆలోచించింది. ఇక తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది. వీడియోలో తన కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా కనిపిస్తూ ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయాన్ని తెలిపింది. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్స్ ఆమెకు కంగ్రాట్స్ అని చెబుతున్నారు.