Actress Poorna: నటి పూర్ణ తన లవర్ అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ ఫోటోలు!

Akashavani

Actress Poorna: తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ నరేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోలో నరేష్ చేసే కామెడీ ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో మనందరికీ తెలిసిందే. మొత్తానికి నరేష్ కామెడీ పరంగా జబర్దస్త్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు. ఇదిలా ఉంటే నరేష్ తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు ప్రూఫ్స్ తో సహా బయట పెట్టాడు.

ఎప్పుడూ సైలెంట్ గా.. కామెడీ పేస్ తో కనిపించే నరేష్ తాజాగా తనకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని జబర్దస్త్ లలో విత్ ప్రూఫ్స్ తో వెల్లడించాడు. ఇక ఆ మాటతో నరేష్ ఇన్ని రోజులు సింగిల్ అని భావిస్తున్న కొందరు వామ్మో అని స్టన్ అవుతున్నారు. ఇంతకూ తన గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు. కొత్తగా జడ్జిగా చేస్తున్న అందాల భామ పూర్ణ.

కెవ్వు కార్తిక్ తో కలిసి నరేష్ ఒక స్కిట్ చేస్తున్న సమయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అంటాడు. కానీ కెవ్వుకార్తిక్ ఆ మాట నమ్మక పోవడంతో నరేష్ కొన్ని ఫ్రూఫ్స్ చుపించాడు. రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే, ప్రభాస్ ట్రైన్ లుక్ ని ఎడిట్ చేసి ప్రభాస్ తల దగ్గర నరేష్ తల పెట్టాడు. ఇక పూజా హెగ్డే తల తీసేసి ఆ ప్లేస్ లో పూర్ణ ను సెట్ చేసాడు.

 Actress Poorna: నటి పూర్ణ తన లవర్ అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ ఫోటోలు!
Actress Poorna: నటి పూర్ణ తన లవర్ అంటూ షాక్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ ఫోటోలు!

Actress Poorna: నరేష్ పూర్ణ కు సంబంధించిన రెండో ప్రూఫ్ ఇదే!

ఇక దానికి సంబంధించిన పోస్టర్ ను నరేష్ చూపిస్తాడు. దాంతో పూర్ణ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇక యాంకర్ రష్మీ మాత్రం అదే పనిగా నోరు వెళ్ళ బెడుతుంది. ఇక నరేష్ అంతేకాకుండా మరో పోస్టర్ కూడా చూపిస్తాడు. అందులో ప్రభాస్ అనుష్క లు విల్లు ఎక్కుపెట్టి బాణాలు వదులుతున్న పిక్ లో వాళ్ళిద్దరు తలలు తీసేస్తాడు. ఇక ఆ ప్లేస్ లో తనది, పూర్ణ ది తల సెట్ చేస్తాడు.

ఇక దీంతో ఆ షో లో అందరూ ఒక్కసారిగా కడుపుబ్బ నవ్వుతారు. దీనికి మరింత ఫిదా అయినా పూర్ణ నరేష్ తో కలిసి కాసేపు స్టెప్పులు వేస్తుంది.

- Advertisement -