Actress Poorna: సీతామహాలక్ష్మి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి పూర్ణ.ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి అనంతరం అవును సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటించి మెప్పించిన పూర్ణ అనంతరం సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ వచ్చారు. ఇలా బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈమె దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం గత ఏడాది జూన్ నెలలో జరిగింది.
ఇలా వీరి వివాహం జరిగిన అనంతరం ఈమె ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు అయితే ఈమె పెళ్లయిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీ రావడంతో ఈ శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇలా తరచూ తన ప్రెగ్నెన్సీ గురించి,తనకు జరిగిన సీమంతపు వేడుకల గురించి ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె 9వ నెలలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
Actress Poorna: తొమ్మిది రకాల వంటలు…
ఇలా పూర్ణ ప్రస్తుతం 9 వ నెల గర్భిణీ కావడంతో వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు తనకు తొమ్మిది రకాల వంటకాలను తయారు చేసి తినిపించారట.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని పూర్ణ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇలా తనకోసం తన కుటుంబ సభ్యులు చేసినటువంటి వంటకాలను తన భర్త ఎంతో ప్రేమగా తినిపించారు ఇందుకు సంబంధించిన వీడియోని పూర్ణ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.ఈ ఫోటోలు వీడియోలు చూసిన అభిమానులు మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో ముందుగానే పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.