Actress PR Varalakshmi: వెండి తెరపై దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తెలుగు, తమిళ, హిందీ మలయాళ భాషలలో సుమారు 800 కు పైగా సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పి ఆర్ వరలక్ష్మి ఒకరు ఈమె జెమినీ గణేషన్ ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి హీరోల సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారు. అయితే తాజాగా ఈమె తమిళ సీరియల్స్ లో నటిస్తూ బిజీ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరలక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ నాకు సహాయం చేసే గుణం ఎక్కువ ప్రతిరోజు ఏదో ఒకటి ఎవరికైనా దానం చేయనిదే నాకు మనశ్శాంతి ఉండదు ఇలా దానధర్మాల పేరుతో కొంత ఆస్తిని పోగొట్టుకున్నానని ఈమె తెలియజేశారు.అలాగే సినిమాల కోసం కొన్ని కోట్లు ఖర్చు చేసి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నానని ఇలా నా ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయని వరలక్ష్మి తెలిపారు.అందరూ అనుకున్నట్లు తనకు వందల కోట్ల ఆస్తి లేదని ప్రస్తుతం సీరియల్స్ సినిమాలు చేస్తూ నా ఖర్చులకు సరిపడా డబ్బు సంపాదించుకుంటున్నానని వరలక్ష్మి తెలిపారు.
Actress PR Varalakshmi: నా భర్త బ్రతికున్నారో లేదో కూడా తెలియదు..
ఇక తన భర్త గురించి ఈమె మాట్లాడుతూ తాను లవ్ మ్యారేజ్ చేసుకున్నానని, ఏడు సంవత్సరాలు పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని తెలిపారు. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి గోల్డ్ మెడలిస్ట్. అయితే ఆయన ఏదైనా కారణం చేత నాతో గొడవ పడితే దాదాపు సంవత్సరం పాటు నాతో మాట్లాడే వారు కాదు. ఈ క్రమంలోనే ఇల్లు అమ్మే విషయంలో నాకు ఆయనకు మధ్య గొడవ జరిగి నాతో మాట్లాడటం మానేసారని ఇలా ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో ఆయన నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోయారని ఈమె తెలియజేశారు. ఇలా 30 సంవత్సరాలుగా ఆయన తనకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన బ్రతికున్నారో లేదో కూడా తనకు తెలియదు అంటూ వరలక్ష్మి తన వ్యక్తిగత విషయాలను తెలిపారు. కేవలం చిన్న గొడవతో బంగారం లాంటి మనిషిని దూరం చేసుకున్నాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.